మన దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన, ఎన్ని శిక్షలు విధించిన గాని మహిళల పై జరిగే అఘాయిత్యాలు ఆగడంలేదు... మొన్నటికి మొన్న నిర్భయ.. తర్వాత దిశ పై జరిగిన అత్యాచారాలే ఇందుకు నిదర్శనం... అయితే ఇలాంటి ఒక ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. తోటి స్నేహితురాలు చాకి చక్యంతో తన స్నేహితురాలిని మానవ మృగాలనుండి కాపాడింది. వివరాలలోకి వెళితే, ఈ సంఘటన శుక్రవారం రాత్రి కావలి పట్టణ జాతీయ రహదారి వెంబడి ఉన్న మహేంద్ర ప్లాట్లకు సమీపంలో జరిగింది. 

 

 


పోలీసులు చెప్పిన బాధితుల వివరాల ప్రకారం... వెంగయ్యగారిపాలెం గ్రామానికి చెందిన సుభాషిణి, ఆమె స్నేహితురాలు మహాలక్ష్మీ మద్దూరుపాడు నుంచి వెంగయ్యగారిపాలెంకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోటారు సైకిల్‌పై బయలుదేరారు. ఆయితే మహాలక్ష్మికి మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం కోసం మహాలక్ష్మి, సుభాషిణి  ఇద్దరు  మార్గమధ్యలోని మద్యం దుకాణం వద్ద ఆగారు. కానీ అక్కడ  మద్యం లేకపోవటంతో తిరిగి గ్రామానికి ఇద్దరు బైక్ మీద  బయలుదేరారు. వీళ్ళకి అడ్డుగా మార్గమధ్యంలో  ఎదురుగా వచ్చిన చెన్నాయపాలెంకు చెందిన ముగ్గురు యువకులు మహాలక్ష్మి, సుభాషిణి ఇద్దరిని ఆపేసారు.  

 

 

అయితే ఈ ఇద్దరిలో మహాలక్ష్మి ఆడవేషంలో కాకుండా మగ వేషంలో ఉంది. ఆ యువకులు మహాలక్ష్మిని పురుషుడని భావించి మహాలక్ష్మీని  పక్కకు నెట్టి సుభాషిణిని బలవంతంగా పక్కనున్న పొలాల్లోకి తీసుకెళ్లారు. దీనితో కంగారుగా మహాలక్ష్మీ మోటారు సైకిల్‌పై తన  గ్రామానికి వెళ్లి  జరిగిన సంఘటన గూర్చి పలువురికి చెప్పింది. పొలాల్లోకి తీసుకెళ్లిన సుభాషిణి పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తుండగా గ్రామస్థులు పలువరు మోటారు సైకిళ్లతో పెద్దగా అరుస్తూ సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

 

 


వాళ్ళని చూసి భయపడిపోయి ఆ యువకులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ యువకులు పారిపోతూ సుభాషిణి దగ్గర ఉన్న నల్లపూసల దండతో పాటు రూ. 5000 నగదు, కాళ్లపట్టీలు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. అయితే ఆ పారిపోయిన యువకులు చెన్నాయపాలెంకు చెందిన కాటంగారి శ్రీను, వాయిల బాబు, మరోవ్యక్తిగా గుర్తించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ ఎస్సై వెంకట్రావ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అబ్బాయి వేషధారణలో ఉండంతో సుభాషిణి ఆ యువకుల భారీ నుండి తనని తాను కాపాడుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: