ప్రేమ గురించి చాలా మంది కవులు గొప్పగా వర్ణించారు. ప్రేమకు కులం, మతం, పెద్ద, చిన్నా అంటూ తేడాలు ఉండవు. కొన్ని సార్లు ప్రేమ గుడ్డిది అనటానికి జరిగిన నిదర్శనాలు ఉన్నాయి. ప్రేమ ఎంత మధురం. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అనడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు ఇండోనేషియాకు చెందిన దంపతులు. 

 

ఇండోనేషియాలో ఓ విచిత్ర పెళ్లి జరిగింది. 103 ఏళ్ల ‘పుఆంగ్ కట్టే’ అనే వ్యక్తి 27 ఏళ్ల ‘ఇండో అలంగ్’ అనే యువతిని వివాహమాడాడు. వీరిద్దరి వయసు వ్యత్యాసం 76 ఏళ్లు. పెళ్లికి వచ్చిన వారంతా వీరిద్దరి జంటని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో విశేషమేమిటంటే వీరిది ప్రేమ వివాహం. 

 

పుఆంగ్ 1945 ఇండోనేషియా యుద్ధం సమయంలో మిలిటరీ కర్నల్‌గా పని చేశాడు. వధువు ఇండో అలంగ్‌కి పెళ్లికి ముందు తన భర్త వయసు 100పైగా ఉంటుదని మాత్రమే తెలుసట. కానీ ఆయనకు 103 ఏళ్ల వయసు ఉందని పెళ్లి తర్వాతే తెలిసింది. పెళ్లిలో వరుడు కన్యాశుల్కం కూడా ఇచ్చాడండోయ్. 25 వేల రూపాయల నగదుతో పాటు ఒక బంగారు ఉంగరం. 

 

వీరి పెళ్లి వార్త ఎంత ఆశ్చర్యంగా ఉందో.. వీరి పెళ్లికి గల కారణం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఇండో అలంగ్ తన బాయ్‌ ఫ్రెండ్‌తో గొడవపడి విడిపోయినప్పుడు ఆమె తన బాధను పొరుగునే ఉన్న పుఆంగ్‌తో పంచుకుంది. ఆ సమయంలో పుఆంగ్ చూపిన ఆప్యాయతకు ఫిదా అయిన అలంగ్ అతనితో ప్రేమలో పడింది.

 

ఇద్దరూ శారీరకంగా కూడా ఏకమయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి అని తెలియగానే లేటు వయసులో తండ్రి కాబోతున్నందుకు పుఆంగ్ సంతోషానికి హద్దులేకుండా పోయాయి. ఇద్దరు పెళ్లిచేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ సుఖంగా దాంపత్య జీవనం కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: