ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుండే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కమిషనర్ రేపటి నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ రాజధాని గ్రామాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రభుత్వం రాజధాని అమరావతి గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకూడదంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. ఈ లేఖలో ప్రభుత్వం తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలలో ఎన్నికలు నిలిపివేయాలని కోరింది. ఎన్నికల కమిషన్ హైకోర్టులో ఉన్న పిటిషన్లు, కేసులను దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఈ లేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 
 
తెలుగుదేశం పార్టీ మాత్రం రాజధాని రైతుల్లో వైసీపీపై వ్యతిరేకత ఉండటం... అక్కడ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు భావిస్తోంది. కొందరు టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించి వైసీపీ రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ద్వారా జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చాడనే చెప్పాలి. 
 
జగన్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన చేసిన తరువాత రాష్ట్ర ప్రజలంతా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాజధాని ఉద్యమంలో పాల్గొని రాజధాని రైతుల తరపున చంద్రబాబు పోరాటాలు చేశారు. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు జరిగి ఉంటే అక్కడ టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చేవి. కానీ ప్రభుత్వం ఆ గ్రామాలలో ఎన్నికలు నిలిపివేయాలని లేఖ రాయడంతో టీడీపీకి షాక్ ఇచ్చినట్లే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: