ఆపద కలిగినప్పుడు ఎవరైనా వచ్చి సహయం చేస్తే బాగుండని చాలా సందర్భాల్లో చాలా మందికి అనిపిస్తుంది.. ముఖ్యంగా ఒంటరి సమయంలో అనుకోని ఆపద ఏదైనా కలిగినప్పుడు, అయిన వారు పక్కన లేనప్పుడు వచ్చే ఆపద నుండి గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఎవరి సహయమైన కావాలి.. కానీ ఇలాంటి ఆపద పెద్ద వయస్సు వారికి గానీ, ఆడపిల్లలకు కానీ ఎదురైతే నిస్సహయంగా ఎదురు చూడటం తప్ప ఏం చేయలేరు.. అందుకే ఇలాంటి వారికోసం ఓ సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు.. నిపుణులు.. దీనిపేరు ఆప్టి సేఫ్..

 

 

ఇది ఆడపిల్లలకు గాని, ఆదరణలేని వయస్సు మళ్లిన వృద్ధులకు గానీ చాలా సహయంగా ఉంటుంది.. దీని పనితనం ఎలా ఉంటుందో తెలియడానికి ఒక వీడియోను రూపొందించారు.. ఆ వీడియోలో చూస్తే ఒక అమ్మాయి రోడ్డు మీదనుండి నడుచుకుంటు వెళ్తుంది… ఆ సమయంలో బండి మీద వచ్చిన… ఇద్దరు ఆకతాయులు అడ్దగించి వెకిలి చేష్టలు చేస్తుంటారు.. అప్పుడు ఆమె భయపడకుండా తన హ్యాండ్ బాగ్ కి ఉన్న ఆప్టి సేఫ్ అనే పరికరం పైన ఉన్న క్యాప్ ని వెంటనే తొలగిస్తుంది. అలా చేయగానే సైరన్ మోగడంతో పాటు… ఆమె ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి మెసేజ్ కూడా వెళ్ళడంతో పాటుగా, ఆమె ఉన్న లొకేషన్, నేను ఆపదలో ఉన్నాను అని ఒక సందేశం వెళ్తుంది.

 

 

అంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి ఈ అలెర్ట్ వినపడుతుంది. ఇదే సమయంలో దానికి ఉన్న స్పై కెమెరా జరుగుతున్న తతంగాన్ని రికార్డ్ చేస్తుంది. అంతే కాకుండా ఎవరైనా అనారోగ్య సమస్యతో పడిపోయినా సరే అక్కడ వారికి సమాచార౦ వెళ్తుంది. ఇలాంటి పరికరం వెంట ఉంచుకుంటే అన్ని విధాల, అందరికి ఉపయోగపడుతుంది.. అయితే ఈ పరికరం ధర ఆన్ లైన్ లో మూడు వేల వరకు ఉంది… ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: