రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించారు మోడీ. దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 2014 కంటే 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోడీ విజయం సాధించడం జరిగింది. దీంతో దేశంలో బీజేపీకి ఇక తిరుగు లేదని ఆ ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరూ అనుకున్న మాట. అదే సమయంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు మరియు nrc,cab బిల్లులతో దేశవ్యాప్తంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్న చాలామంది మైనారిటీలు ప్రస్తుతం అభద్రతా భావంతో ఉన్నారు. ఇదే సమయంలో ఆ చట్టాలు తీసుకు వచ్చిన తర్వాత దేశంలో మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

 

ముఖ్యంగా డిల్లీ ఎన్నికలలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చేతిలో చాలా ఘోరంగా బిజెపి పార్టీ ఓడిపోవడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇటువంటి నేపథ్యంలో చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ చాలా విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తనకు రాజకీయ అడ్డువచ్చిన ప్రత్యర్థుల విషయాలలో మొదటిసారి అందరికీ చెక్ పెట్టిన మోడీ రెండో సారి మాత్రం ఒక్క అడుగు వేయడానికి నాలుగడుగులు వెనక్కి వేసి మరి వ్యూహాన్ని అమలు చేద్దామా వద్దా అన్న రీతిలో రాజకీయం చేస్తున్నారు.

 

తాజాగా ఢిల్లీ అల్లర్లను చూపించిన రెండు మీడియా ఛానల్ కి నోటీసులు పంపిన మోడీ ప్రభుత్వం...వెంటనే తర్వాత రోజే వెనక్కి తగ్గింది. ఢిల్లీ మత అల్లర్లను దేశ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేశారని సదరు న్యూస్ ఛానల్ యజమానులకు ముందుగా షోకాజ్ నోటీసులు పంపించిన తర్వాత బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే బ్యాండ్ చేయాల్సిన టైం లోనే సదరు రెండు న్యూస్ ఛానల్స్  యధావిధిగా పనిచేయడంతో...మీడియా విషయంలో మోడీ వణుకుతున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో మీడియాకి ఎవరైనా వణకల్సిందే ఆఖరికి మోడీ కూడా అన్న రీతిలో జాతీయస్థాయిలో కౌంటర్ పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: