అమరావతికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని రిలయన్స్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ కలవటాన్ని పచ్చపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళద్దరి భేటిపై తన చె(కొ)త్తపలుకులో తన బాధంతా వెళ్ళ బోసుకున్నాడు పాపం. ఒక ముఖ్యమంత్రిని ఓ పారిశ్రామికవేత్త కలిస్తే మధ్యలో వేమూరికి ఏమి బాధ వచ్చిందో అర్ధం కావటం లేదు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన ముఖేష్ బద్ధ శతృవైన జగన్ ను కలవటం ఏమిటన్నదే ఈయన బాధంతా.

 

తనలోని బలహీనతను జయించలేకపోవటం వల్లే ముఖేష్ అంతటి వాడు స్వయంగా అమరావతి వచ్చిన జగన్ ను కలిసినట్లు ఈయన తేల్చేశాడు. ఇంతకీ ముఖేష్ కున్న బలహీనతలేమిటియ్యా అంటే తన సన్నిహితుడు పరిమళ్ ధీరజ్ నత్వానీని రాజ్యసభ సభ్యత్వం ఇప్పించటమే బలహీనతట. సన్నిహితుడికి రాజ్యసభ సభ్వత్వం ఇప్పించటం బలహీనత ఎలా అవుతుందో వేమూరే చెప్పాలి. అంటే సన్నిహితుడిని రాజ్యసభకు పంపటమనే బలహీనత వల్లే ముఖేష్ అంతటి వాడు జగన్ ను కలవాల్సొచ్చిందే అన్నదే పచ్చపత్రిక బాధగా అర్ధమవుతోంది.

 

సిఎం అయిన తర్వాత జగనే ముంబాయ్ వెళ్ళి ముఖేష్ కలుద్దామని చాలా సార్లు ప్రయత్నంచేశాడట. అయితే జగన్ ను కలవటానికి ముఖేష్ ఇష్టపడలేదని కూడా ఈయనే చెప్పాడు. అలాంటిది హఠాత్తుగా ముఖేషే తనంతట తానుగా జగన్ కలవటానికి వచ్చాడంటే నత్వానీయే కారణమని వేమూరి తేల్చేశాడు. మొత్తానికి నత్వాని ఎంత పనిచేశాడు అన్న భావనే చెత్తపలుకులో కనిపించింది.

 

పనిలో పనిగా విజయసాయిరెడ్డిని కూడా వేమూరి ప్రశంసించాడు లేండి. జగన్-ముఖేష్ భేటి వెనుక విజయసాయే చక్రం తిప్పారట. నత్వానీ అవసరాన్ని గ్రహించి రెడ్డి ఢిల్లీలో మంచి ప్లాన్ వేసినట్లు పచ్చపత్రిక బయటపెట్టింది. ఏదేమైనా జగన్ కు  విజయసాయి ఢిల్లీలో చాలా పెద్ద అసెట్ అని వేమూరి అంగీకరించాడు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబుకు ఢిల్లీలో లేరన్న బాధే పచ్చపత్రిక  ఎండి రాతల్లో బాగా కనబడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: