2019 ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే...వైసీపీకి 151 సీట్లు వచ్చేయా? అని ప్రశ్న ఉత్పన్నమైతే ఖచ్చితంగా వచ్చేవి కాదని రాజకీయ విశ్లేషుకులు చెబుతారు. ఎందుకంటే టీడీపీ-జనసేనలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా బెన్‌ఫిట్ జరిగింది. 2014లో టీడీపీకి జనసేన మద్ధతు ఇవ్వడం వల్ల చంద్రబాబుకు అధికారం సులువుగా దక్కగలిగింది.  కానీ 2019 ఎన్నికల్లో జనసేన సెపరేట్ కావడంతో చాలాచోట్ల టీడీపీ విజయావకాశాలపై ప్రభావం చూపించింది.

 

జనసేన కొన్నిచోట్ల ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీ ఓడిపోయి, వైసీపీ గెలవగలిగింది. ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో. అలా టీడీపీ విజయావకాశాలని జనసేన దెబ్బతీయడం వల్ల వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. అదే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే కనీసం 50 సీట్లు వరకు తెచ్చుకునేవారు. అప్పుడు వైసీపీ 120-130 దగ్గర ఆగేది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

 

ఈ సారి కూడా పవన్...జగన్‌కు బాగానే సాయం చేసేలా కనిపిస్తున్నారు. దీంతో బాబుకు మళ్ళీ గట్టి దెబ్బ పడుతుంది. స్థానిక ఎన్నికల్లో జనసేన-బీజేపీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయిన, కొన్ని చోట్ల మాత్రం ప్రభావం చూపే అవకాశముంది. కాకపోతే గెలిచెంత సీన్ మాత్రం రాదు. కానీ టీడీపీకి పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జనసేన-బీజేపీ కూటమికు కాస్త పడుతుంది. దీంతో వ్యతిరేక ఓటు చీలిపోయి, టోటల్‌గా జగన్‌కు లబ్ది చేకూరుతుంది.

 

ముఖ్యంగా జనసేన కాస్తో, కూస్తో ప్రభావం చూపించే గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి భారీ నష్టం జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లు ఈ రెండు పంచుకుని, మళ్ళీ చేతులు కాల్చుకొనున్నాయి. మొత్తానికైతే జగన్ అనుకున్నట్లుగా స్థానిక పోరులో 90 శాతం సీట్లు సాధించాలనే లక్ష్యానికి పవన్ బాగానే సాయం చేసేలా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: