ఆంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక పరంగా అత్యంత కీలకమైన జిల్లా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి కాస్త గట్టి పట్టున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి విశాఖ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆ విషయం 2014 ఎన్నికల్లో క్లియర్‌గా తెలిసింది. జిల్లాలో ఉన్న 15 సీట్లలో టీడీపీ 11 సీట్లు గెలుచుకుంది. అటు మూడు ఎంపీ సీట్లలో రెండు గెలుచుకుంది. అయితే ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన జగన్ తల్లి విజయమ్మ కూడా ఓటమి పాలయ్యారు.

 

ఇక ఎప్పుడైతే విజయమ్మ ఓటమి పాలయ్యారో, అప్పటి నుంచి జగన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎంపీ విజయసాయిరెడ్డి 2014 నుంచి విశాఖలో పని చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక ఆయనకు కష్టానికి ఫలితం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మొత్తం 15 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంటే, మూడు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

 

ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపై ఎలాంటి ఫోకస్ పెట్టారో, అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో తెలిసిందే. ముఖ్యంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి అని బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా స్పష్టం చేశారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సమీక్షా సమావేశంలో అవంతి, విజయసాయిని పొగడ్తలతో ముంచెత్తారు. విశాఖ రాజధాని అయిందంటే అందులో కీలక పాత్ర విజయసాయి రెడ్డిదేనని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుపు బాధ్యత విజయసాయిదే అన్నట్లు చెప్పారు. ఇక ఈ స్థాయిలో అవంతి, విజయసాయిని పొగడటానికి కారణాలు లేకపోలేదు.

 

స్థానిక సంస్థల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడుతాయని జగన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దీంతో విజయసాయిని పైకి లేపితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించి, తన మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తారని అనుకుంటున్నారు. అందుకే విజయసాయిపై అవంతి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: