అధికార పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు ఉన్న దూకుడు టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుకు కూడా ఉండి ఉంటే..! అనే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌స్తుతం బీసీల రిజ‌ర్వేష‌న్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హీటెక్క‌డ‌మే!  ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈ నెల ఆఖ‌రులోగా స్థానిక ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. అయితే, ఈ క్ర‌మంలో బీసీల‌కు 34 శాతం కోటా అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ భావించారు. ఈ క్ర‌మంలోనే మొత్తం రిజర్వేష‌న్లు దాదాపు 60 శాతంగా పేర్కొంటూ జీవో ఇచ్చారు. అయితే, దీనిని ఓ వ్య‌క్తి హైకోర్టులో స‌వాల్ చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుకు భిన్నంగా ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నార‌ని కోర్టుకు ఫిర్యాదు చేశారు.



దీనిపై ఉత్త‌ర్వులు ఇచ్చిన హైకోర్టు.. ఎట్టి ప‌రిస్థితిలోనూ 50శాతం రిజ‌ర్వేష‌న్ గీత దాట‌రాదంటూ ష‌ర‌తు విధించింది.  దీంతో  ఒక్క‌సారిగా బీసీల‌కు రిజ‌ర్వేష‌న్‌ల‌లో 10 శాతం కోత‌ప‌డింది. దీంతో బీసీలకు 24శాతం తో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను కూడా జారీ చేశా రు. దీంతో  ఈ ప‌రిణామాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్న టీడీపీ.. జ‌గ‌న్‌ను బీసీల‌కు ద్రోహిగా చూపిం చేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  రిజ‌ర్వేష‌న్ లేక పోవ‌డంతో బీసీల‌కు అన్యాయం జ‌రుగుతుం ద‌ని చంద్ర‌బాబే నేరుగా ప్ర‌చారం చేస్తున్నారు.



బీసీలు అణ‌గ‌దొక్క‌డంలో జ‌గ‌న్ ముందున్నాడ‌ని ఆరోపిం చారు. అంతేకాదు, దీనిపై టీడీపీ నేతలు ఏకంగా సుప్రీం కోర్టుకు ఎక్కారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ వాద‌న మ‌రోలా ఉంది. ఈ నెల ఆఖ‌రు నాటికి స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క పోతే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, దీంతో రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని అంటూ ఎన్నిక‌ల‌కు మొగ్గు చూపింది. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా బీసీల విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యం తీ సుకున్నారు. త‌న పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రిజ‌ర్వేష‌న్లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ నిర్ణ యం మేర‌కు 34శాతం బీసీల‌కు ఇస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంటే వైసీపీలో వంద‌కు 34 సీట్ల‌ను బీసీల‌కే కేటాయించ‌నున్నారు.



దీంతో న్యాయ‌ప‌రంగా వారికి అన్యాయం జ‌రిగినా.. పార్టీ ప‌రంగా న్యాయం జ‌రుగుతుంది. మ‌రి బీసీల త‌ర‌ఫున తీవ్ర‌స్థాయిలో మాట్లాడుతున్న చంద్ర‌బాబు కూడా త‌న పార్టీ త‌ర‌ఫున ఓ నిర్ణ‌యం తీసుకుంటే బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంది క‌దా?! అనే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలోనూ, ఇత‌ర విష‌యాల్లోనూ కూడా ఆవేశానికి లోన‌య్యే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఇలా ఆలోచిస్తారా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: