తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు.. టీడీపీ నేత‌, పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే వంగ‌లపూడి అనిత జోరు పెంచారు.  తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. త‌న‌కంటూ ప్ర‌త్యే క గుర్తింపు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలో ఆమె అస‌లు విష‌యాన్ని వ‌ది లేసి సా ము చేస్తున్నార‌నే భావ‌న తెర‌మీదికి వ‌స్తోంది. తాజాగా మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అనిత స్పందించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రోజూ వేసే రాళ్ల‌నే మ‌రిన్ని ఎక్కువ‌గా.. మ‌రోకోణంలో విసిరేశారు. అంతే త‌ప్ప‌. ఆమె చేసిన కొత్త ప్ర‌క‌ట‌న కానీ, కొత్త విమ‌ర్శ కానీ ఏమీ క‌నిపించ‌లేదు.



జ‌గ‌న్ ప్ర‌భుత్వం మహిళ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని అనిత అన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పారు. అయితే, ఈ స‌మ‌యంలో అనిత వాస్త‌వాల‌కు దూరంగా మాట్లాడార‌ని, ఆమె ఇంకా వాస్త‌వాలు తెలుసుకోక‌పోతే.. క‌ష్ట‌మ‌ని అంటూ సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు కురుస్తు న్నాయి. అంతేకాదు, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలంటూ.. అనిత‌ను ఉద్దేశించి సూచిస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ ప‌ద‌వుల్లోను 50 శాతం మ‌హిళ‌ల‌కే ఇస్తోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. పేదల ఇళ్లల్లో ‘అమ్మ ఒడి’ వెలుగులు నింపింది. పెద్ద చదువులను చదివించుకునేందుకు ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది.



అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లకు జీతాలు పెరిగాయి. అన్ని వయసులు, వర్గాల మహిళలకు పింఛన్లు అందుతున్నాయి. వీటన్నిటికి తోడు ఈ ఉగాది నాడు 26.6 లక్షల మంది మహిళల చేతికి స్వంత ఇంటి స్థలమనే ఆస్తి అందబోతోంది. రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. మంత్రి వర్గం లోనూ, మంచి పదవుల్లోనూ మహిళలకు స్థానం లభించింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. 

 

 
ఇందుకోసం ఏకంగా చట్టమే చేశారు. ఆలయాల పాలకమండళ్లనుంచి మార్కెట్‌ కమిటీల వరకు అన్నింటిలోనూ మహిళలు ముందువరుసలో కని పిస్తున్నారు. మ‌రి ఇంత‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల విష‌యంలో దూకుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. అనిత వ్యాఖ్య‌లు చూస్తే.. న‌వ్వు వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆమె దూకుడు త‌గ్గించి.. ఆలోచిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: