ఏపీ రాజకీయాల్లో పోరు రసవత్తంగా సాగుతుంది.. ఒక వైపు టీడీపి బ్యాచ్ మరో వైపు వైసీపి బ్యాచ్ హోరాహోరిగా ఆటను కొనసాగిస్తున్నారు.. వారి వారి మాటలతో వేటను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు.. ఇక ఇలాంటి పరిస్దితుల్లో పదవి లేని బాబుగారి ముఖం దీపం లేని ఇల్లులా మారింది.. ఒకవైపు రాజకీయ జీవితం రచ్చబండలా మారి ప్రతి వారికి అలుసైపోగా మరో వైపు వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్ది బాబుగారి పాలిట గుది బండలా మారాడని అనుకుంటున్నాడట..

 

 

ఎందుకంటే టీడీపి పార్టీని పెద్ద స్టేడియంలా మార్చుకున్న విజయసాయిరెడ్ది చంద్ర బాబుతో క్రికెట్ మ్యాచ్‌లు వరుసపెట్టి ఆడుతున్నాడు.. ఇక ఈ స్టేడియంలోకి తాజాగా యస్‌ బ్యాంక్‌ మ్యాటర్ వచ్చింది.. అదేమంటే  ప్రయివేట్ బ్యాంకుల్లో దేశంలోని అతిపెద్దదైన ‘యస్‌ బ్యాంక్‌’ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ కూడా రంగంలోకి దిగి ‘యస్‌’ బ్యాంక్‌ నిర్వహణ బోర్డును రద్దు చేసి కొత్త సీఈవోను నియమించడమే కాకుండా, ఖాతాదారులు నెలకు రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేసుకో కూడదని ఆంక్షలు విధించింది.

 

 

కాగా.. యస్ బ్యాంకు వ్యవహారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి లంకె పెట్టారు విజయసాయి రెడ్డి. అంతే కాకుండా దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ ట్వీట్ చేశారు. ఇక యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశారని, బాబు కమీషన్లు దండుకోవడానికి రూ.1300 కోట్ల టీటీడీ నిధులను డిపాజిట్ చేయించారని ఆరోపణలు చేసారు...

 

 

ఇది చాలదన్నట్లుగా ఏపీ టూరిజం నిధులను, యస్ బ్యాంకుకు చంద్రబాబు దోచిపెట్టారని విజయసాయి రెడ్డి విమర్శించారు... ఇవేగాక ఇలాంటి మెసాలు ఇంకెన్ని ఉన్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తంగా యస్‌ బ్యాంక్‌ మోసంలో చంద్రబాబు హస్తం ఉందని విజయసాయి రెడ్డి చెప్పకనే చెబుతున్నారని అంతా అనుకుంటున్నారట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: