మనకు తెలిసినంత వరకు చాలా మంది ప్రాణహాని కలిగించని జంతువులను పెంచుకుంటారు. కొంత మంది పాములతో ఆడుతుంటే చూశాం. మరి కొంత మంది పులులను మచ్చిక చేసుకోవటం చేశాం. కానీ ఈమె మాత్రం ఏకంగా మొసలితోనే పోటీ పడింది. తన ధైర్య సాహసాలను ప్రదర్శించి మహిళలు దేనిలో తక్కువ కాదు అనే మాటను రుజువు చేసింది. ఈ అరుదైన సంఘటన ఫ్లోరిడాలోని బ్రైటన్‌ లో చోటు చేసుకుంది. 

 

 

ఫ్లోరిడాలోని బ్రైటన్‌లో ఫ్రీస్టైల్ ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అష్లే లారెన్స్‌ అనే మహిళ పాల్గొనేందుకు ఆమె మైదానంలో అడుగు పెట్టింది. దింతో అక్కడ చుట్టూ కొంత దూరంలో జనాలు గుమిగూడి ఉన్నారు. ఆమె ఎదురుగా ఓ మొసలి ఉంది. ఆమె దానికి చేరువగా వెళ్లింది. గోరుముద్దలు తినిపించడానికి అన్నట్లుగా మొసలి నోరును తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి ఆమెకు ఎంత మాత్రం సహకరించలేదు.

 

 

మొసలితో పోరాటం అంటే చాలా కష్టంతో కూడిన పని. అయితే ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలో అష్లే లారెన్స్‌ అతి కష్టంగానే రెండు చేతులతో దాన్ని అదిమిపట్టుకుని మొసలి నోరును తెరిచింది. వెంటనే నేరుగా ఆమె తలను మొసలి నోట్లోకి పోనిచ్చింది. ఇది చూసిన వారికి క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆపేసినట్లనిపిస్తుంది. 

 

 

అసలే మొసలి క్రూర జంతువు తన కన్న పిల్లలను అదే తినేస్తుంది. పైగా దాని నోట్లో తలకాయ పెట్టడం అంటే మృత్యువుకు ఎదురెళ్ళడమే. కానీ అదృష్టవశాత్తూ కొన్ని సెకన్ ల తర్వాత ఎలాంటి ప్రమాదం బారిన పడకుండానే దాని నోట్లో నుంచి ఆమె సురక్షితంగా తల బయటకు తీసింది. దింతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి అక్కడ ఉన్న వారంతా కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం పలికారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: