స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి . విశాఖ నగర కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే శ్రమిస్తోంది . మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , విశాఖ ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . విశాఖ తోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు  ఉందని  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు .

 

విశాఖ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం లో ఆయన  పాల్గొన్నారు . విశాఖ నగర మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ క్యాడర్ కు వివరించారు . స్థానిక సంస్థల్లో 75 శాతం ఉద్యోగులను స్థానికులకే కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు . విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు  . ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేదేనని ఆయన చెప్పుకొచ్చారు .   

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ , ఎమ్మెల్యేలకే అప్పగించిన విషయం తెల్సిందే . స్థానిక సంస్థలు చేజారితే ఎమ్మెల్యేలు , మంత్రుల పదవుల ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరికలు కూడా చేశారు . దీనితో  ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయి లో శ్రమించి పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు . ఇప్పుడిదే అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి సంధిస్తున్నట్లుగా కన్పిస్తోంది  . స్థానిక సంస్థల్లో పార్టీ అభర్ధుల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆయన కూడా చెబుతున్నారు . దీనితో   అనివార్యంగా పార్టీ అభ్యర్థులను  గెలిపించాల్సిన బాధ్యత  ఎమ్మెల్యేల భుజస్కందాలపై పడింది .

మరింత సమాచారం తెలుసుకోండి: