స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వెనుకంజ వేస్తోందా?, అందుకే ఆ పార్టీ కోర్టును ఆశ్రయించి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాన్ని చేస్తోందా ?? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . కరోనా వైరస్ ను సాకుగా చూపెడుతూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం , ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా ఎంపిటిసి , జెడ్పిటిసి, మున్సిపల్ , పంచాయితీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెల్సిందే .

 

అయితే ఈ షెడ్యూల్ పై టీడీపీ నాయకత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది . ఒక ఎన్నిక ఫలితాల ప్రభావం మరొక ఎన్నికపై చూపే అవకాశం ఉందని , అందుకే ఎన్నికల షెడ్యూల్ పై ఆ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లాలని  నిర్ణయించుకుంది  . అయితే ఇక్కడే టీడీపీ నాయకత్వ వ్యవహార శైలి విమర్శలపాలవుతోంది . ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని , జగన్ తుగ్లక్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెబుతున్న టీడీపీ నాయకత్వం , మరొకవైపు  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా తమ పార్టీ క్యాడర్ కు ఎటువంటి సంకేతాల్ని  ఇస్తున్నారో అర్ధం చేసుకోవాల్సిన అవసరముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .

 

తాము ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసినట్లుగా టీడీపీ నాయకత్వ వ్యవహారశైలి ఉందని విమర్శిస్తున్నారు . కాసేపు టీడీపీ నేతలు చెబుతున్నదే నిజమని అనుకుందాం... ఒకవేళ ఒక ఎన్నికల ఫలితాల ప్రభావం మరొక ఎన్నికలపై చూపుతుందని   అనుకుంటే , రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత వల్ల టీడీపీ కి మేలు జరిగే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: