చైనా దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 73 దేశాల్లో విస్తరించి ఉంది. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఈ వైరస్ వల్ల భూమి మీద మానవ జాతి మనుగడ డేంజర్ జోన్ లో పడిందని ప్రకటించడం జరిగింది. యూరోప్ కంట్రీ లలో కూడా ఈ వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో ఆ దేశాలు ప్రస్తుతం వణికిపోతున్నాయి. మంచి ప్రదేశాలు లో ఈ వైరస్ చనిపోవటం చాలా కష్టమైన నేపథ్యంలో కరోనా దెబ్బకి గజా వణికి పోతున్నాయి. ఇటీవల భారతదేశంలో కూడా ఈ మహమ్మారి కరోనా రావడంతో కేంద్ర ప్రభుత్వం ఫుల్లు అలర్ట్ అయింది. కరోనా దెబ్బకి కేరళలో మరియు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించడం జరిగింది.

 

ఇటీవలే హైదరాబాద్ నగరంలో కూడా ఈ వ్యాధి ఉన్నట్లు వార్తలు రావడంతో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వైద్య శాఖ ను అప్రమత్తం చేసి ప్రజలందరినీ ధైర్య పరచడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 194 మంది మరణించారు.

 

వైరస్‌ కారణంగా ఇరాన్‌ మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ వార్త మరువముందుకే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో ఉన్న దేశాలు డేంజర్ జోన్ లో పడినట్లు అయ్యాయి. ఒక ఇరవై నాలుగు గంటల్లోనే 49 మంది ఫసక్ అవడంతో ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హైలెట్ న్యూస్ గా మారింది. మొత్తంమీద చూసుకుంటే చైనా దేశంలో కంటే ఇరాన్ దేశంలో కరోనా వైరస్ చాలా ఫాస్ట్ గా పాకిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: