ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా పార్టీలు త‌మ క‌స‌ర‌త్తు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా జ‌న‌సేన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియామకం చేసింది ఆ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున ఈ నేత‌లు సమన్వయం చేయ‌నున్నారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు.

 


కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో బీజేపీ-జ‌న‌సేన పార్టీల ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీల సభ్యులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ జీ హాజరై ముఖ్య ఉపన్యాసం చేశారు. జనసేన నుంచి  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ సీనియ‌ర్లు కందుల దుర్గేష్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, టి.శివశంకర్, వి గంగులయ్య, సి.హెచ్ మధుసూదన్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కలసి ముందు వెళ్లే అంశం మీద ఇరు పార్టీల నేతల మధ్య కీలక చర్చ జరిగింది. అనంత‌రం జ‌న‌సేన జిల్లాల వారీ బాధ్యుల‌ను నియ‌మించింది. 

 

జ‌న‌సేన పార్టీ జిల్లాల సమన్వయకర్తలు 
శ్రీకాకుళం : డాక్టర్ బి.రఘు 
విజయనగరం : గడసాల అప్పారావు 
విశాఖపట్నం (రూరల్) : సుందరపు విజయ్ కుమార్ 
తూర్పుగోదావరి : బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)
పశ్చిమ గోదావరి :  ముత్తా శశిధర్ 
కృష్ణా :  పోతిన మహేశ్ 
గుంటూరు :  కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.)
ప్రకాశం :  షేక్ రియాజ్ 
నెల్లూరు : సి.మనుక్రాంత్ రెడ్డి 
చిత్తూరు : బొలిశెట్టి సత్య
కడప : డా.పి.హరిప్రసాద్ 
కర్నూలు : టి.సి.వరుణ్ 
అనంతపురం : చిలకం మధుసూదన్ రెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి: