కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ అమృత ల పై కక్ష కట్టిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఒక మనిషికి సూపారి  ఇచ్చి మరి ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేయించాడు మారుతి రావు. ఇక ఈ కేసు విచారణలో ప్రధాన నిందితుడిగా మారుతీరావు అని తేలడంతో మారుతి రావుకి  జైలు శిక్ష కూడా పడింది. అయితే ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అని చెప్పాలి. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. 

 

 దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవనానికి చేరుకున్నారు. ఇక ఆర్య వైశ్య భవన్ లో మారుతీరావు మంచంపై విగతజీవిగా కనిపించాడు. ఈ సందర్భంగా మారుతీరావు మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. ఈ సూసైడ్ నోట్లో గిరిజ  నన్ను క్షమించు.. అమృత అమ్మ దగ్గరికి వెళ్లి పో అంటూ రాసి ఉంది. ఈ నేపథ్యంలో మారుతీరావు మృతదేహం వద్ద ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అనే అనుమానంతో క్లూస్ టీమ్ తో   తనిఖీలు చేయించారు పోలీసులు. అయితే మొన్నటికి మొన్న మారుతీ రావు కు చెందిన షెడ్ లో ఒక శవం లభించడం... ఇక ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిపోయింది. మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

 ఓవైపు కేసుల ఒత్తిడి మరోవైపు మీడియా వద్ద నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం వల్లే మారుతీరావు చనిపోయి ఉంటాడు అని పలువురు అనుమానిస్తున్నారు. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు ఆత్మహత్యపై ఆయన సన్నిహితుడు కరీం కీలక విషయాలను బయట పెట్టాడు. మారుతి రాజు తనకు 35 ఏళ్ల పరిచయం ఉందని ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అంటూ తెలిపాడు. తన కూతురు అమృత తో మాట్లాడాలి అని మారుతీ రావు ప్రతిక్షణం పరితపించేవాడని.. తన కూతురు మీద ఉన్న అతి ప్రేమ మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత వరకు దారి తీసి ఉండొచ్చు అంటూ తెలిపాడు. గత కొంత కాలంగా తన కూతురు అమృత తో  మాట్లాడాలని మారుతీరావు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది అంటూ మారుతీరావు సన్నిహితుడు కరీం కీలక విషయాలను బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: