సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న షాకులతో మాజీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోతోంది. దెబ్బ మీద దెబ్బ గ్యాప్ లేకుండా జగన్మోహన్ రెడ్డి కుమ్మేస్తున్నాడు.. తాజాగా స్థానిక సంస్థల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగోలా వాయిదా వేయించాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చివరకు కరోనా వంటి వ్యాధులను కూడా అడ్డుగా పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

కానీ అవి ఫలించలేదు.. చివరకు ఎన్నికల బరిలో దిగిక తప్పడంలేదు.. దీనికితోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చాడు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అధికారికంగానే ఇవ్వాలని చట్టం తీసుకొచ్చినా.. హైకోర్టులో కేసులు వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు జగన్ నేరుగా పార్టీ టికెట్లు కేటాయింపు బీసీలకు 34 శాతానికి తగ్గకుండా సీట్లు ఇస్తామని ప్రకటించేశారు.

 

 

దీంతో చంద్రబాబు సైతం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించక తప్పని పరిస్థితి తలెత్తింది. తాజాగా స్థానిక ఎన్నికల పర్యవేక్షణ కమిటీలతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు 34%పైగా స్థానాలు కేటాయించాలని నిర్ణియంచారు. బీసీ సాధికారత అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 34%నుంచి 24%కు తగ్గించిందని విమర్శించారు. బీసీలు టీడీపీకి అండగా ఉన్నారనే సీఎం కక్షతో కుట్రకు పాల్పడ్డారని చెప్పారు.

 

 

రిజర్వేషన్లలో కోతపెట్టి బీసీల రాజకీయ పునాదుల ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు కామెంట్ చేశారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా బీసీలను అణచివేయడం అసాధ్యం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% పైగా స్థానాలు కేటాయిస్తామని తేల్చిచెప్పారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసీపీ అరాచకాలకు అడ్డుకోవాలన్నారు. మొత్తానికి జగన్ ఎఫెక్టుతో చంద్రబాబు కూడా బీసీలకు పెద్ద పీట వేయక తప్పని పరిస్థితి వచ్చింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: