మన దేశంలో ఉచిత పథకాలు ఎక్కువ. వెనుకపడిన వారిని ఆదుకోవాల్సిందే.. అందులో సందేహం లేదు.. కానీ.. అది ఎలా.. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేసి.. కానీ వాళ్లను నిత్యం బిచ్చగాళ్లుగా చేసి కాదు.. ఆకలిగా ఉన్నవాడికి ఒక చేపనిస్తే ఒక రోజు మాత్రమే తినగలుగుతాడు. చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తినగలుగుతాడు’. చైనా దాన్ని ఆచరణలో పెట్టింది.

 

 

1968 నుంచి 1988 వరకు భారత్‌, చైనాల జీడీపీలో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ, పదేళ్లు తిరిగేసరికి భారత్‌ జీడీపీ 1.34 శాతానికి తగ్గింది. చైనా జీడీపీ మాత్రం 2 రెట్లు పైగా పెరిగింది. 2008లో బీజింగ్‌లో చైనా నిర్వహించిన ఒలింపిక్స్‌ చూసి, ఆ తరువాతి ఒలింపిక్స్‌ నిర్వహించవలసిన ఇంగ్లాండు నివ్వెరపోయింది. ‘మా స్థాయిలో మేం నిర్వహిస్తాం కానీ చైనాతో పోల్చుకోవద్ద’ని ప్రపంచాన్ని కోరింది.

 

 

అవినీతి కేసులలో ప్రభుత్వ ఉద్యోగులు దొరికితే కుల సంఘాలతో పైరవీలు చేయించుకునే స్వేచ్ఛ చైనాలో లేదు. పౌరులకు ట్రాఫిక్‌ నిబంధనలు ధిక్కరించే స్వేచ్ఛ లేదు. నాయకులకు వేలు, లక్షల కోట్లు అవినీతి చేసుకునే స్వేచ్ఛ లేదు. విధులలో ఉన్న సమయంలో పూజలు, ప్రార్థనలు చేసుకునే హక్కు ఏ మతస్థులకీ లేదు. కులం, మతం, ప్రాంతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పే, ఆ శవాలతో రాజకీయం చేసుకునే స్వేచ్ఛ చైనాలో అసలే లేదు.

 

 

మనం ఏదైతే స్వేచ్ఛగా భావిస్తున్నామో, అది స్వేచ్ఛ కాదు. విశృంఖలత, బాధ్యతా రాహిత్యం. భారత్‌లోని రాజకీయ పార్టీలు, మన పాలకులు చైనా నుంచి తెలుసుకోవలసింది ఏంటంటే.. పేదరికాన్ని పారదోలాలంటే, పేదల పక్షం.. అంటే ఎప్పుడూ పేదవారితో ఉండడమో, ఉన్నట్లు నటించడమో, వారుండే గుడిసెల చుట్టూ సానుభూతితో తిరగడమో, తినే బియ్యం ఉచితంగా అందించడమో కాదు. వారికి ఉపాధి కల్పించాలి, పనిని ప్రోత్సహించాలి. అప్పుడు మాత్రమే పేదరికం పోతుంది. దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: