తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి దక్కబోతున్న రెండు రాజ్యసభ స్థానాలపై ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది. రెండు రాజ్యసభ స్థానాల్లో ఆశావహులు మాత్రం ఎక్కువమంది కనిపిస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలి అంటే తమ అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ అధినేత కెసిఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యుల ఎంపిక కేసీఆర్ కు కత్తి మీద సాములా మారింది. ఒకరికి అవకాశం కల్పిస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండడంతో ఎవరికి రాజ్యసభ స్థానం కట్టబెడతారనే సందేహం కేసీఆర్ లో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో టిక్కెట్లు దక్కని వారికి, అలాగే పార్టీ సీనియర్లకు కొంతమందికి ఎడాపెడా రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తామని హామీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వారంతా తమను రాజ్య సభకు పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. 

IHG


ముఖ్యంగా ఈ  రాజ్యసభ రేసులో గట్టిగా వినిపిస్తున్న పేరు లోక్ సభ మాజీ సభ్యురాలు కెసిఆర్ కుమార్తె కవిత. ఈమెను రాజ్యసభకు పంపాలంటూ బాగా ఒత్తిడి వస్తోందట. అలాగే జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ వాయిస్ ను బలంగా వినిపిస్తున్న సీనియర్ నాయకుడు కే కేశవరావు కూడా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. హోం శాఖ మాజీ మంత్రి నాయని నరసింహా రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి తదితరులు తమకు అవకాశం ఇవ్వాలంటూ కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 


వీరే కాకుండా చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ కేసీఆర్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించాలనే విషయమే చాలా లోతుగా పరిశీలన చేస్తున్నట్టు టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఎవరి పేరును ఫైనల్ చేస్తారో తెలియకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. రెండు రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్న వారు సుమారు పది మంది వరకు ఉండడంతో వారిలో ఇద్దరిని ఎంపిక చేస్తే, మిగతా వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండడంతో వారిని ఏ విధంగా బుజ్జగించాలి అనే విషయం పైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: