ఈ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి బాగా మొదలైంది. పార్టీలు అన్ని గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో తలకిందులై ఉన్నాయి. ఇంకోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలో 27, 29న పోలింగ్ జరుపుటకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

 

IHG

ఇవి ఇలా ఉంటే పంచాయతీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామాలల్లో సర్పంచ్‌ లతో పాటు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఆ గ్రామం ఏకగ్రీవమైతే గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.20 లక్షల వరకు నజరానా ఇస్తా అన్నారు. 

 

 

ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీ రాజ్‌‌ శాఖ ప్రభుత్వానికి పంపింది. దీనితో రెండు రోజుల్లో జీవో సైతం వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ఈ నజరాలను ఇస్తోంది. 

 

 

 

ఆయా గ్రామాల్లో ప్రజలు కలిసికట్టుగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఐడియా తోనే ఈ ప్రోత్సహకాలను ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రతి గ్రామాలకు ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ నిధులు గ్రామాలకి అందుతాయి. ఈ అమౌంట్ తో పాటు పంచాయతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: