రెండు రోజుల క్రితం మరణించిన మారుతీరావు చుట్టూ అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన మరణం పెద్ద మిస్టరీగా మారిపోయింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కూతురు అమృత తనకిష్టం లేని వివాహం చేసుకున్నదనే కోపంతో అల్లుడిని హత్య చేయించిన విషయం అప్పట్లో రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించించిన విషయం తెలిసిందే.

 

సరే హత్య విషయం బయటపడినప్పటి నుండి ఈ కేసులోని ప్రతి మలుపు ఓ సంచలనంగానే ఉంటోంది. హత్యానేరంపై మారుతీరావు కొన్ని నెలల పాటు జైల్లో ఉండి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా అంటే మొన్న శనివారం హైదరాబాద్ లోని చింతల్ బస్తీలో మరణించటం మళ్ళీ సంచలనంగా మారింది.

 

శనివారం సాయంత్రం 6.50 గంటలకు మారుతిరావు చింతల్ లోని హోటల్లో దిగాడు. తర్వాత రెండు గంటల తర్వాత చూస్తే చనిపోయున్నాడు. ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే హోటల్లోకి వెళ్ళిన తర్వాత తన కారు డ్రైవర్ ను పిలిపించి టిఫిన్ తెప్పించుకున్నాడు.  డ్రైవర్ దగ్గర నుండి టిఫిన్ తెప్పించోకోగానే తలుపులు వేసేసుకున్నాడు. మళ్ళీ తలుపులు తీయలేదు. రాత్రి భోజనం కోసం హోటల్ బాయ్స్ తలుపులు తట్టినపుడు ఎటువంటి రెస్పాన్ప్ రాకపోవటంతో అనుమానం వచ్చింది.

 

వెంటనే పోలీసులకు చెప్పటంతో వాళ్ళు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్ళినపుడు మంచంపై అడ్డంగా పడిపోయిన మారుతిని గమనించారు. అయితే ఆయన అప్పటికే మరణిచింనట్లు సమాచారం. అయితే హోటల్ కు రావటానికి ముందు మారుతి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు అన్నది మిస్టరీగా మారిపోయింది. కారు డ్రైవర్ ను కూడా హోటల్ దగ్గరే ఉంచేసినట్లు చెబుతున్నారు.

 

ముందేమో మారుతి ఉరేసుకున్నాడన్నారు. కానీ ఆ ఆనవాళ్ళు కనబడలేదు. విషం తీసుకున్నాడని తర్వాత అనుమానించారు. కానీ విషం బాటిల్ కనబడలేదు. పురుగుల మందేమైనా తీసుకున్నాడేమో తెలీలేదు. ఆ విషయం కూడా పరీక్షల్లో పెద్దగా ధృవపడలేదు. ఇదే ప్రస్తుతం మిస్టరీగా మారింది.  కాల్ డేటాను పరిశీలించాలని అనుకుంటే రెండు మొబైల్స్ లో ఒకటి కనబడలేదట. దాంతో మారుతి మృతి పెద్ద మిస్టరీగా మారింది. ఎటునుండి దర్యాప్తు చేయాలో అర్ధంకాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: