గతంలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో మారుతీ రావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో... ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి మరీ అమృత భర్త ప్రణయ్ ని మారుతీ రావు హత్య చేయించినట్లు  విచారణలో వెల్లడి కావడంతో మారుతీరావు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే తాజాగా ఖైరతాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో మారుతీ రావు సూసైడ్ చేసుకోవడం పెద్ద దుమారమే రేపింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి మారుతీరావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో... మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడానికి కూతురు అమృత అనే కారణం అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక తాజాగా ఈ వార్తలపై స్పందించినది  మారుతీ రావు కూతురు అమృత. 

 

 

 తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు తానే కారణం  అంటే అస్సలు అంగీకరించను అంటూ స్పష్టం చేస్తోంది. ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన అమృత... తన తండ్రి మారుతీరావు ఇంట్లో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయని... ఆ విషయంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అంటూ వెల్లడించింది. అంతేకాకుండా అల్లుడు ప్రణయ్ ని చంపిన పశ్చాత్తాపం కూడా తన తండ్రి మారుతీరావు ను వెంటాడి ఉండవచ్చు అంటూ అమృత పేర్కొంది. ఎప్పుడైతే తాను  ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను తన తండ్రి హత్య చేయించాడో  అప్పుడే తన తండ్రి మీద  ప్రేమ చచ్చిపోయిందని... ఇప్పుడు ఆయన మరణించిన ఎలాంటి భావోద్వేగాలు కలగడం లేదు అంటూ వెల్లడించింది. 

 

 

 కాని తన తండ్రిని చివరిసారిగా చూడాలని మాత్రం తనకు ఉందని... దానికి పరిస్థితులు అనుకూలిస్తే వెళ్లి వస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అటు మారుతి రావు కూతురు అమృత పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అమృతకి కన్న తల్లిదండ్రుల పైన కనికరం కూడా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక దీనిపై కూడా అమృత ఘాటుగానే స్పందించారు. నాకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని వారు చేస్తున్న వ్యాఖ్యల గురించి ఇప్పుడు  పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటూ స్పష్టం చేసింది అమృత.

మరింత సమాచారం తెలుసుకోండి: