మన ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి నాడు భోగి మంటలు వేసుకుంటాం. కానీ కొన్ని చోట్ల హోలి పండుగకి భోగి మంటలు వేసుకుంటారట. ఏ పండుగైనా ప్రతీ ఒక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. అయితే కొన్ని చోట్ల భోగిమంటలు వేసుకుని ఆ పండుగని జరుపుకుంటారు. 

IHG

 

అయితే ఈ కధని వినే ఉంటారు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఈ ప్రయత్నంలో అగ్ని మీద హోలిక ఉంటే దాని మీద కూర్చోమంటాడు ప్రహ్లాదుడిని అప్పుడు హోలికకి మంట తగలకుండా శాలువాని కప్పుకుంటుంది. కాపాడమని ప్రహ్లాదుడు విష్ణువుని అడుగగా ఆ శాలువా ఎగిరి ప్రహ్లాదుడు మీద పడుతుంది. హోలిక మంటలు తగిలి చచ్చిపోతుంది. దీనిని సంతోషంతో ప్రజలు హోలిక దహన్ అంటూ మంటలు వేస్తారు. ఇదే హోలి భోగి మంటలు. ఇలా ఆనందంతో పండుగలో భాగంగా ఈ మంటలని వేసి చక్కగా పండుగని జరుపుకుంటారు.

 

IHG

 

అంతే కాకుండా రాక్షసి హోలిక, హోలక, పూతన వంటి రాక్షసులని దహనం లేదా మదన్‌ ను అంటారు. దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. ఇలా ఈ పద్ధతిని అనుసరించి ఈ మంటలని వేస్తారు. అంతే కాకుండా మనం జరుపుకునే విజయ దశమి రోజు రావణుడి ప్రతిమని ఎలా అయితే దహనం చెస్తామో అట్లే ఈ హోలికని కూడా దహనం చెస్తారు. అయితే మొదట ఈ పద్ధతి ఎక్కువగా కనపడేది. కానీ రానురాను ఈ పద్ధతి కనుమరుగైపోతోంది. అయితే ఎక్కడో కొన్ని చోట్ల ఇంకా చేస్తున్నారు. అయితే ఇలా కర్రలతో పేర్చి మంట పెడుతూ చివర్లో హోలికని ద్వంసం చేస్తున్నారు. ఇలా హోలిక రాక్షసిని చితి పెట్టి పండుగ చేసుకుంటారు. భోగి మంటలులానే హోలి భోగి మంటలు వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: