గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ముద్దాాయి అయిన మారుతిరావు.. అమృత తండ్రి హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విషయం తీసుకొని చనిపోయారని పోలీసులు ప్రకటించారు. అయితే ఆయన తండ్రికి తమ కుటుంబం ఇలా విచ్చినం కావడానికి కారణం అమృత అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తన తండ్రిని కడసారి చూసుకోవాలని అమృత తెలుపగా.. ఆమె బాబాయి.. మారుతిరావు సోదరుడు అభ్యంతరాలు పెట్టినట్టు వార్తలు వచ్చాయి.  కాగా, తన తండ్రిని చివరి చూపు చూసుకునేందుకు తన తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించడం లేదని మారుతీరావు కుమార్తె అమృత ఆరోపించిన సంగతి తెలిసిందే.

 

దాంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. మారుతిరావు అంత్యక్రియలకు అమృత వస్తుందా..? వస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయి అంటూ తెగ వార్తలు రావడంతో మారుతిరావు సోదరుడు శ్రవణ్ స్పందించారు. అంత్యక్రియలకు రావొద్దని అమృతకు తాము చెప్పిలేదని... తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు, మిర్యాలగూడలోని మారుతీరావు ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. అయితే అంతిమ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు  అయితే తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు తానే కారణమంటే అంగీకరించేది లేదని ఆయన కుమార్తె అమృత స్పష్టం చేసింది. 

 

తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసునని, వాటివల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, అల్లుడిని చంపించానన్న పశ్చాత్తాపం ఆయనకు అప్పటి నుంచే ఉందని.. తనకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేరని ఆయనకు మసస్సాక్షికి తెలుసు అని అన్నారు. ఇప్పుడు తనలో ఎటువంటి భావోద్వేగాలూ కలగడం లేదని వెల్లడించింది. తనకు తండ్రిని చివరి సారిగా చూడాలని మాత్రం ఉందని, అందుకు పరిస్థితులు అనుకూలిస్తే, వెళ్లి వస్తానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: