ప్రస్తుత బిజీ కాలంలో ప్రజలు ఎప్పడికప్పుడు రాబోయే పనులని కూడా షెడ్యూల్ చేసుకొని మరీ పనులు పూర్తి చేసుకుంటారు. అందులో ప్రయాణాలు కూడా ఒక వంతు అని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ముఖ్యంగా పండుగల సమయంలో ఇంక చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఆ సమయాలలో ప్రయాణించాలంటే వేళకి వేలు పోసి టికెట్ కొనాల్సిన పరిస్థితి. ఇవన్ని ఒకెత్తు అయితే మధ్య తరగతి వాళ్లకు అనుగునుగుణంగా ఉండే రైళ్ల పరిస్థి ఇంకో దారి.

 

IHG

 

అందులో ముఖ్యంగా తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ టికెట్లు కళ్ళు మూసి తెరిచే లోగ అయిపోతాయి. వెబ్‌సైట్ క్రాషింగ్, యాప్ స్లోడౌన్ వంటివి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో చాలా మందికి కామన్ విషయం. ఇంకా కొన్ని సందర్భాల్లో టికెట్ బుకింగ్ చివరి క్షణంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇలాంటప్పుడు టికెట్ బుకింగ్‌ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి పరిష్కారంగా కొన్ని టిప్స్‌తో సమస్యలను అధిగమించి టికెట్‌ ను కాస్త సులువుగా బుక్ చేసుకోవచ్చు.

IHG

 

మొదటగా చూసుకోవాలిసినది ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండేలా చూసుకోవాలి. తత్కాల్ టికెట్ ని బుకింగ్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఆడితే ఉపయోగిస్తున్నారా దానిని ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్‌కు కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. నిజానికి చాలా మంది తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ టైం ప్రారంభమైన తర్వాత ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ లోకి లాగిన్ అవుతూ ఉంటారు. నిజానికి ఇది ఒక పెద్ద సమస్య, కాబట్టి ఇలా చేయవద్దు. దానికోసం ముందుగానే లాగిన్ అయ్యి ఉండాలి. 

 

 

ఉదయం 11 గంటలకు ముందుగానే లాగిన్ అయ్యింటే, మీరు ఒక నిమిషం ఆదా అవుతుంది. అందుకే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్‌ కు అన్నా ముందే లాగిన్ అయితే టికెట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్యాసింజర్ల వివరాలను రెడీగా ఉంచుకోవాలి. ప్యాసింజర్ పేరు, వివరాలు, స్టేషన్ కోడ్ వంటివి దగ్గర పెట్టుకోవాలి.  తర్వాత ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ లో వీటిని పేస్ట్ చేసుకొనేలా ఎక్కడైనా ముందుగానే రాసి ఉంచుకుంటే ఇంక సులువు అవుతుంది. 

 

 

ఇందుకు గాను ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో మాస్టర్ లిస్ట్‌ను క్రియేట్ చేసుకోవడం ఒక సులువైన మార్గం. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ లోని మై ప్రొఫైల్‌ లో మాస్టర్ లిస్ట్ కనపడుతుంది. ఇక్కడ మీ ప్యాసింజర్ల వివరాలను ముందుగానే ఉంచుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో ఆటోమేటిక్‌ గానే ఈ పేర్లని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక  తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ ఫెయిల్యూర్స్ చాలా సర్వ సాధారణం అని చెప్పవచ్చు.

 

 

మీరు ఈ సమస్యను అధిగమించాలంటే ఫాస్టెస్ట్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు పేమెంట్ కోసం డిజిటల్ వాలెట్ ఉపయోగిస్తూ ఉంటే అందులో ముందుగా డబ్బులు ఉండేలా చూసుకోండి. అదే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ కార్డులను మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఇపే-లేటర్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. దీనితో వెంటనే టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ కనెక్టివిటీ కూడా బాగా ఉండేలా చూసుకోవాడి మన విధి. ఈపే - లేటర్ ఆప్షన్‌తో ఓటీపీ ప్రక్రియను తప్పించుకోవచ్చు. ఇలా వివిధ జాగ్రత్తలు తీసుకుంటే టికెట్ ని సులువుగా ఇట్టే పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: