హోలి పండుగ అంటే రంగుల పండుగ. పండుగ నాడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలు. వివిధ రకాలుగా పండుగని జరుపుకుంటారు. ప్రతీ ఒక్కరూ వారి పద్ధతులలో అనుసరిస్తూ పండుగ చేసుకుంటారు. అయితే ఈ పండుగని వాళ్ళు వాళ్ళ పద్ధతితో చేసుకుంటూ ఉంటారు. ఒక్కో చోట ఒక్కోలా ఈ పండుగ చేసుకోవడం నిజంగా గమనార్హం.

 

 

హోలీ అనేది సంస్కృత పదం. హోలీ అంటే రంగుల పండుగ. ఈ పండుగ మన భారతదేశంలో మాత్రమే కాక అనేక చోట్ల జరుపుకుంటారు. నేపాల్, బంగ్లాదేశ్ వారు కూడ జరుపుకుంటారు. బంగ్లాదేశ్ లో అయితే దీనిని దోల్ యాత్రగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల హోలిని ఒక్క రోజు పండుగలా కాదు ఏకంగా పదహారు రోజుల పండుగల చేసుకుంటారు. కృష్ణుడు జన్మించిన మధుర, బృందావనం, నందగావ్ వంటి పలు చోట్ల ఈ పండుగని భారీ ఎత్తులో నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి భారీ స్థాయిలో జనం పాల్గొని ఈ పండుగని ఆనందిస్తారు.

IHG

 

భారతీయ హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌధ్ధులు, జైనులు, నేపాలీ హిందువులు, బౌద్ధులు కూడా ఈ పండుగని ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలో జరుపుకునే ఈ పండుగని రంగుల పంచమి అని కూడ పిలుస్తారు. ఇలా ఈ పండుగని రంగులతో, రంగు నీళ్ళతో జరుపుకుని ఎంతో ఆనందిస్తారు. శీతాకాలం తర్వాత వచ్చే ఈ పండుగలో ప్రజలు భారీగా పాల్గొని వివిధ రకాల రంగులతో ఆనందంగా ఈ పండుగని చేసుకుంటారు. అయితే కొన్ని చోట్ల ఇది ఒక్క రోజు పండుగ అవ్వచ్చు కానీ పలు చోట్ల పదహారు రోజుల పండుగ ఈ హోలి. అయితే అక్కడ ఎక్కువగా సందడి ఉంటుంది. ఎంతో చక్కగా భారీ స్థాయిలో ఈ పండుగ చేసుకుంటారు జనం ఎంతో సరదాగ.

మరింత సమాచారం తెలుసుకోండి: