నిన్న అనగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రెండు ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ రెండు ఫోటోలనూ ఒక హిజాబ్ ధరించిన 14 ఏళ్ల బాలిక పోలీసుల అధికారిక లాంఛనాలతో గౌరవాన్ని పొందుతూ కనిపిస్తోంది. తరువాత నేరుగా వెళ్లి డీఎస్పీ సీటులో కూర్చుంటుంది. ఈ రెండు ఫోటోలను మినహాయించి ఒక వీడియో కూడా జాతీయ మీడియా వెబ్సైటు లలో తెగ చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ 14 ఏళ్ల బాలిక సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డి.ఎస్.పి జాబ్ తెచ్చుకుందనే ఒక ప్రచారం సోషల్ మీడియా లో జరిగింది. అయితే ఆ ప్రచారం కేవలం ద్రుష్ప్రచారం అయినప్పటికీ... ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రి అయినట్టు... ఈ 14 ఏళ్ల బాలిక కూడా ఒక్క రోజుకి డి.ఎస్.పి అయ్యింది.



వైరల్ అయిన వీడియో లో ఏం కనిపించిందంటే... ఓ పెద్ద పోలీస్ కారులో ఆమె వచ్చి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టగానే ఒక ఉన్నత పోలీసు అధికారి తనకి సెల్యూట్ చేసి గౌరవిస్తూ ఆ స్టేషన్ పోలీసు సిబ్బందికి పరిచయం చేస్తాడు. వరుసగా నిల్చున్న పోలీసు సిబ్బంది 14 ఏళ్ల డిఎస్పి కి సెల్యూట్ చేసిన అనంతరం ఆమె నేరుగా డీఎస్పీ ఆఫీస్ లోకి వెళ్లి డిఎస్పి సీట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లు ఆ దృశ్యాలను తమ కెమెరాలలో బంధించిగా ఆ ఫోటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయని తెలుస్తోంది.

 



ఇక వివరాలు తెలుసుకుంటే... మహారాష్ట్రలోని బుల్దనా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ బాలిక పేరు షరీష్ కాన్వాల్ కాగా ఆమె మల్కాపూర్ లోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఐతే మహిళా దినోత్సవం సందర్భంగా ఆ జిల్లాకి చెందిన కలెక్టర్ సుమన్ చంద్ర ఈ ఇనిషియేటివ్ ని టేక్ అప్ చేసి బాలికల ని మోటివేట్ చేస్తూ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఇలా చేశారని తెలిసింది. ఏది ఏమైనా ఒక్కరోజు డిఎస్పి జాబ్ చేసిన షరీష్ చాలా సంతోషపడిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: