గుజరాత్ లోని మాదవ్ పూర్ గ్రామంలోకి సింహం ప్రవేశించింది. అయితే.. ఆ ఊరిలోని కొంతమంది స్థానికులు అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక దగ్గర నిల్చున్నారు. అయితే.. వారు కబుర్లలో పడి చుట్టుపక్కల ఏం జరుగుతోందని పట్టించుకోలేదు. సడన్ గా ఒక దగ్గర నుంచి సింహం ఉరులోకి ప్రవేశించింది. గుంపులుగా ఉండి అక్కడ నిల్చున్న జనాలను చూసి వారి వైపుకు దూసుకెళ్లింది. అయితే.. అక్క ఉన్న జనాలు ఏం చేశారో చూద్దాం..

 


అసలు నార్మల్ గా సింహాన్ని దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది. అలాంటిది అది జనాల్లోకి వచ్చి గర్జించింది. అయితే దీంతో అక్కడ ఉన్న జనాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు.

 

 


కాగా., అక్కడ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ట్వీట్ లో ఏమని రాశారంటే.. ‘‘ఒక్కసారి ఆ స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. సింహం మిమ్మల్ని గంటకు 80 కిమీల వేగంతో తరుముకుంటూ వస్తే మీకు ఎలా ఉంటుంది? ఉసైన్ బోల్ట్ కూడా దాని నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే.. అతడి పరుగు వేగం గంటలకు 38 కిమీలు’’ అని పేర్కొన్నారు. కాగా., ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మరి జరిగిన ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా..??అనే విషయం గురించి తెలియాల్సి ఉంది. అలాగే ఆ సింహాన్ని అటవీ అధికారులు బంధించారా.. లేదా..?? అనేది ఇంకా తెలియరాలేదు. ఒక వేళ మీరు ఈ వీడియోను చూడాలనుకుంటే చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: