ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేషన్ల ప‌ర్వం మొద‌లైంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభమైంది. అయితే క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో మాత్రం పోటీకి ముందే టీడీపీ ఎన్నికల‌కు ముందే ప‌రారైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే జ‌గ‌న్‌కు ఏకంగా 90 వేల మెజార్టీ వ‌చ్చింది. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి. ఒక‌రిద్ద‌రు ఉన్నా వాళ్లు పోటీ చేసేందుకు కూడా ముందుకు రావ‌డం లేదు. ఇక సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తోన్న పులివెందుల‌లో అయితే  స్థానిక స్థంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర‌న్న నిర్ణ‌యానికి టీడీపీ నేత‌లు వ‌చ్చేశార‌ట‌.



ఇటీవ‌ల ఎన్నిక‌ల కోసం ఏర్పాటు చేసిన స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ స‌తీష్‌రెడ్డి సైతం చంద్ర‌బాబుకే నేరుగా ఇదే విష‌యం చెప్పార‌ని అంటున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే బాబు డైరెక్ష‌న్‌లోనే స‌తీష్‌రెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని కూడా టాక్ వ‌చ్చింది. అస‌లు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నేత‌లు చాలా వేషాలు వేశారు. పులివెందుల‌కు నీళ్లు ఇచ్చామ‌ని.. ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో సైకిల్ పార్టీ దూసుకు పోతుంద‌ని స‌వాళ్లు రువ్వారు. యేడాది త‌ర్వాత క‌ట్ చేస్తే ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో సైతం పోటీ చేసేందుకు టీడీపీకి అభ్య‌ర్థులే దొర‌క‌ని ప‌రిస్థితి.



అస‌లు స‌తీష్‌రెడ్డి సైతం ఎన్ని రోజులు పార్టీలో ఉంటాడో ?  తెలియ‌ని ప‌రిస్థితి. పులివెందుల‌ను ప‌క్క‌న పెట్టేస్తే ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఇంచార్జ్‌ల్లో కొంద‌రు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ కావ‌డం లేదు. మ‌రికొంద‌రు పోటీ చేసినా ఏదో నామ్ కే వాస్తే టైపు నామినేష‌న్ వేయాల‌ని చూస్తున్నారు. చాలా మందికి ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే క్లారిటీ రావ‌డంతో ముందుగానే అస్త్ర‌స‌న్యాసం చేసే వారు కొంద‌రు అయితే.. మ‌రికొంద‌రు విల్లులు, ఆయుధాలు వ‌దిలేసి యుద్ధంలోకి వ‌స్తుండ‌డం కామెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: