కోట్ల ఆస్తి, పరువును కాపాడలేకపోయింది.. కూతురి పై ఉన్న ప్రేమ ప్రాణాలను రక్షించలేక పోయింది.. కూతురు తప్పు చేసిందని తండ్రి.. తండ్రి తప్పుచేసాడని కూతురు.. వీరిద్దరి వల్ల రెండు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి అనాధగా మారాయి.. ఒక్త తల్లి కొడుకును కోల్పోగా, ఓ బిడ్ద తండ్రిని కోల్పోయాడు, ఓ భార్య భర్తను కోల్పోయింది.. చివరికి ఎవరికి ఎవరు కాకుండా పోయారు.. అతి ప్రేమ అనర్ధాలకు మూలం అనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుంది..

 

 

ఇకపోతే 2018లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఆయన హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. కూడు పెట్టని కులం కోసం, చస్తే వెంటరాని పరువుకోసం ఆనందంగా సాగవలసిన బ్రతుకుని అర్ధాంతరంగా ముగించాడు.. నిజం చెప్పాలంటే ఒక తండ్రిగా మారుతీరావు ఓడిపోయాడు, తండ్రిగానే కాదు భర్తగా, సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా కూడా ఓడిపోయాడు.. ఇదే కాకుండా తాను చనిపోతే అంతా సర్ధుకుంటుంది అనే నిర్ణయం తీసుకోవడంలో కూడా ఓడిపోయాడు..

 

 

ఒక రకంగా స్వచ్చంగా పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులకు ఈ ఘటన ఒక గుణపాఠం అని చెప్పవచ్చూ.. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు... నాకు కూతురే పుట్టలేదని మనసు నిమ్మలం చేసుకుని, అమృతకు దూరంగా ఈ సువిశాల ప్రపంచంలో అన్ని బంధాలను తెంపేసుకుని బ్రతికే చాన్స్ ఉంది.. కాని కులం అనే గజ్జి మారుతీరావుని అలా ఉండనీయక తప్పుల మీద తప్పులు చేసేలా ప్రోత్సహించింది.. చివరికి ప్రాణాలు తీసుకుంది..

 

 

ఇక అమృత విషయానికి వస్తే లోకంలో ఎందరో ప్రేమించు కుంటున్నారు, కానీ అందరికి ఇలాంటి అన్యాయం జరగడం లేదు.. తన కుటుంబ స్దితిగతులను, తన తండ్రి మనస్తత్త్వాన్ని తెలిసిన అమృత తండ్రికి నచ్చినట్లుగా జీవిస్తే సరి అని తనకు తాను త్యాగం చేసుకుంటే బాగుండేది.. లేదా తాను ప్రేమించిన వాన్ని తీసుకుని ఎవరికి దొరకనంత దూరం వెళ్లి కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంగా బ్రతికితే బాగుండేది.. కానీ ఇలా ఎవరికి వారు మనసులో ఒక రకమైన ఆలోచనలను పెట్టుకుని బ్రతికారు..

 

 

తన భర్తను చంపడం మారుతీరావు చేసిన తప్పే.. కానీ ఒక నష్టం జరిగాక అయినా పోయిన వాడు ఎలాగో పోయాడు నా బాబుని చూసుకుంటూ ఇలాంటి మనుషులకు దూరంగా ఎక్కడో ఒకచోట బ్రతుకుతా అని అమృత ఆలోచించలేదు.. ఇక్కడ ఎవరి పగా తీరలేదు.. ఇక తండ్రిగా మారుతిరావు ఓడిపోయాడు.. కూతురిగా అమృత ఓడిపోయింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: