ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి.  గత ఏడాది భారత్ లో పుల్వామా దాడిలో 41 మంది జవాన్లు అమరులయ్యారు.  అయితే ఈ దాడికి థీటుగా ఉగ్రవాదులకు సరైన బుద్ది చెప్పారు భారత జవాన్లు. ఉగ్రవాదులు తమ ఉనికి చాటుకునేందుకు ఇప్పుడు మరోఘాతుకానికి పాల్పపడ్డారు.  ఈ నేపథ్యంలో సూడాన్ దేశ ప్రధాన మంత్రి అబ్దల్లా హామ్దక్ పై బాంబు దాడి జరిపారు. అయితే అదృష్టం కొద్ది ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించకున్నారు.  దేశ రాజధాని కార్టోమ్ లో ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డు పక్కన ఆపి ఉంచి కారులో ఎవరో బాంబు పెట్టారు. సరిగ్గా ఆయన కారు అక్కడికి వచ్చినప్పుడే బాంబును పేల్చి చంపేయాలని చూశారు. 

 

అయితే బాంబు ఏర్పాటు చేసిన వారు సరైన ప్లానింగ్ ప్రకారం బాంబు పేల్చలేక పోయినట్లు తెలుస్తుంది.. కాకపోతే బాంబు బ్లాస్ట్ అయినప్పటికీ అక్కడ పాక్షికంగా కార్లు దెబ్బతిన్నాయి. అయితే ఆ బాంబు ను ఓ కారులో పెట్టి ఉంచడం వల్ల ఆ కారు తుక్కు తుక్కు అయ్యింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు చుట్టు పక్కల ఇంకా ఏమైనా బాంబులు అమర్చారా అన్న విషయంపై పూర్తి విచారణ చేపట్టారు.  కాకపోతే ప్రధాని పయణిస్తున్న కారు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

 

దాంతో పాటు అధికారులు ప్రయాణిస్తున్న మరో రెండు కార్లు కూడా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతుంది.  ఈ దాడి ఎవరు చేశారు... తమ లక్ష్యం ఏంటనేది ఇంకా తెలియాల్సిన ఉంది. కాగా, బాంబు దాడి జరిగిన సమయంలో ప్రధాన మంత్రి హామ్దక్ తన అధికారిక కార్యాలయానికి వెళుతున్నారు. అయితే ఈ దాడి ఏ ఉగ్రవాద సంస్థ చేశారు అన్న విషయం  ఇంకా ప్రకటించలేదని అధికారులు తెలిపారు. సూడాన్ లో చాలా కాలంగా మిలటరీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ పరిస్థితి మారాలంటూ డిమాండ్లు వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: