చైనా దేశంలో వెలుగులోకి వచ్చి మరణ మృదంగం మోగిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది కరోనా వైరస్ . ఇక కరోనా  వైరస్ విజృంభిస్తుండడంతో సోషల్ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు కూడా మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నో ప్రచారాలు ప్రజలను ప్రభావితం కూడా చేస్తున్నాయి . అయితే తెలంగాణలో కూడా కరోనా  కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ తింటే కరోనా  వస్తుందని తప్పుడు ప్రచారం జరగడంతో... చికెన్ కొనడానికి ఎవరు కనీసం ముందుకు   రావడం లేదు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా తెలిపారు. 

 

 చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని పుకార్లు షికార్లు చేస్తుండడంతో చికెన్ షాపులన్ని  వెలవెలబోతున్నాయి. అయితే చికెన్ తినడం వల్ల కరోనా  వైరస్ రాదని ఎన్ని  అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం తప్పుడు ప్రచారాలను నమ్ముతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి చికెన్ కి కరోనా కు  ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలు మాత్రం చికెన్ కొనడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోయి పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర స్థాయిలో నష్టాలు వస్తున్నాయి. 

 

 

 చికెన్ కొనడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చికెన్ షాప్ యజమాని వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. కేవలం ఇరవై ఐదు రూపాయలకే కిలో చికెన్ అమ్మడానికి సిద్ధపడ్డాడు చికెన్ షాపు యజమాని. కేవలం వంద రూపాయలకి నాలుగు కిలోల బరువు తూగే రెండు కోళ్లను అమ్ముతూ  వినియోగదారులు ఆకట్టుకుంటున్నారు. కోళ్ళకి కరోనా వైరస్ ఉండదు అని చాటి చెప్పేందుకు ఆ చికెన్ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. అయితే ఈ లెక్కన చూసుకుంటే కేవలం కిలో చికెన్ 25 రూపాయలకు మాత్రమే వచ్చినట్లు అవుతుంది. దీంతో ఆ చికెన్ షాప్ కు వినియోగదారులందరూ క్యూ కట్టారు. అయితే ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోవడంతో రెండు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: