పరిపాలనలో  జగన్మోహన్ రెడ్డి  తీసుకుంటున్న నిర్ణయాలను ఎన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయో తెలుసా ? వివిధ  అంశాలపై జగన్ అమలు చేస్తున్న నిర్ణయాలను ఆరు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. నిజంగా తమ ముఖ్యమంత్రి పరిపాలన బాగుందని చెప్పటానికి వైసిపి నేతలు, శ్రేణులకు ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమి కావాలి ? అందుకే వైసిపి నేతలు కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టంలో వైసిపి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. అవేమిటంటే డబ్బు, మద్యం, రౌడీయిజం ప్రభావాన్ని నియంత్రించాలన్నది జగన్ టార్గెట్. ఇందుకోసమనే చివరకు ఎన్నికల్లో ప్రచారం వ్యవధిని కూడా తగ్గించేశారు. డబ్బు, మద్యం పంచుతూ ఎవరైనా పట్టుబడితే వారిని అరెస్టు చేయవచ్చని తాజా చట్టంలో ఉంది. అలాగే మూడేళ్ళ జైలుశిక్ష కూడా విధించటమే కాకుండా వారిపై తరువాత ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడుతుంది.

 

సరే తాజా చట్టంపై అందరిలోను ముఖ్యంగా ప్రతిపక్షాల్లో అనేక సందేహాలు, భయాలు ఉన్నాయి. అయితే ఎన్నికలు పూర్తియితే కానీ చట్టం ఎలా పనిచేసింది అన్న విషయం తెలియదు. ఈ విషయాలను పక్కనపెడితే తెలంగాణా అసెంబ్లీలో కూడా జగన్ ప్రస్తావన రావటం గమనార్హం. అదేమిటంటే తెలంగాణాలోని స్కూళ్ళల్లో కూడా ఏపిలో జగన్ అమలు చేస్తున్నట్లే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టబోతున్నట్లు కేసియార్ ప్రకటించారు.

 

అలాగే జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో అయితే మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఉత్తరాఖండ్ లో అయితే మూడు రాజధానులను ప్రకటించేశాడు కూడా. కర్నాటకలో అధికార వికేంద్రీకరణకు చర్యలు కూడా మొదలైపోయాయి. ఇక జార్ఖండ్ లో కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

 

ఇక మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు దిశ చట్టం అమలుపై రాష్ట్రంలో అధ్యయనం చేసిన విషయాలు తెలిసిందే.  గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను ఢిల్లీలో ప్రవేశ పెట్టాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పిపిఏలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే.  చూశారా ఏపిలో జగన్ పరిపాలనను ఎన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: