మొన్నటి ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ చంద్రబాబునాయుడుకు బాగానే తగిలినట్లుంది. లేకపోతే స్ధానిక సంస్ధల ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో మాట్లాడకూడని మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు చెప్పేదేమిటంటే జనాలే తెలుగుదేశంపార్టీని కాపాడుకోవాలట. పార్టీ తరపున తమ నేతలు పోరాటం చేసేంత వరకూ చేస్తారట. మిగిలిందంతా జనాల చేతుల్లోనే ఉందని చంద్రబాబు అంటున్నారు.

 

వైసిపికి ఓ జోల్ట్ ఇవ్వక పోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని పట్టటం కష్టమని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. అందుకనే బాబూ  మాకు సహకరించండి అంటూ జనాలను దేబిరిస్తున్నారు. మొన్నటి వరకూ మీకేం భయం లేదు మీకు మేమున్నాం అంటూ బీరాలు పలికిన ఇదే చంద్రబాబు ఇపుడేమీ మీరే టిడిపిని కాపాడుకోవాలి అని బతిమాలాడుకుంటున్నాడంటే ఏమిటర్ధం ?

 

అసలు ఇక్కడే ఓ అనుమానం వస్తోంది అందరికీ.  టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం జనాలకు ఏముంది ? అధికారంలో ఉన్న ఐదేళ్ళ పాటు జనాలను పీడించుకుని తిన్నదే చంద్రబాబు. అవినీతి, అరాచకం, విచ్చలవిడిగా చెలరేగిపోయిన నేతలను కంట్రోల్ చేసుకోలేని ఫలితంగానే మొన్నటి ఘోర ఓటమి అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. చంద్రబాబు పరిపాలను భరించలేకే జనాలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు.

 

గడచిన తొమ్మిది నెలల పరిపాలనలో సంక్షేమానికే జగన్ పెద్ద పీట వేశారు. అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తేవటంతో  జగన్ సుమారుగా 1.6 కోట్లమంది లబ్దిదారులను నేరుగా చేరినట్లే అయ్యింది. పథకాల అమలులో ఎక్కడైనా లోపాలుంటే ఉండచ్చు, అర్హులకు పథకాలు అందకపోతే పోయుండచ్చు. దాన్ని కూడా సరిచేయటానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ సిఎం అవ్వటాన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, టిడిపి నేతలు, పచ్చమీడియా అధిపతులు మాత్రమే ప్రతిరోజు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.

 

రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఎవరిది పై చెయ్యనే విషయాన్ని జగన్-చంద్రబాబు తేల్చుకుంటారు. ఈ ఎత్తులు పై ఎత్తుల్లో జగన్ ముందు చంద్రబాబు తేలిపోతున్నారు. దాంతో మీడియా అండ ఎంతున్నా ఉపయోగం లేదని అర్ధమైపోయిన చంద్రబాబు తమకు అండగా ఉండమని చివరకు జనాలనే బతిమలాడుకుంటున్నారు. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యవహారం  చూస్తుంటే ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లు అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: