తెలుగు రాష్ట్రాలను కదిలించి వేసిన ఘటన అంటే దిశా హత్య.. పశు వైద్యురాలు దిశాను నలుగురు మృగాళ్లు వెంటాడి వెంబడించి .. మరి రేప్ చేసి మరి దారుణంగా పెట్రోల్ పోసి కాల్చేశారు.అతి దారుణంగా నలుగురు చంపేశారు. ఆ ఘటన తెలుగు రాష్ట్రాలను కదిలించి వేసింది. ఈ ఘటనలో నేరం మోపిన నలుగురు మృగాళ్లను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి కుక్కను చంపినట్లు చంపేశారు... 

 

 


ఈ వైశ్య యావత్ రాష్ట్రాలను కదిలించి వేసింది. ఈ ఘటన పూర్తిగా మరువక ముందే ఎందరో మహిళలపై ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలను ప్రభుత్వ అమలు చేసిన కూడా మహిళను ఈ మృగాళ్లు వదలడం లేదు. రోజుకు రోజుకు ఎందరో మహిళలు  మగాళ్ల పై రేచిపోతేనే ఉన్నారు.. అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు దిశా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 

 

 


అయితే ఈ మృగాళ్లలో ఒకరైన చెన్నకేశవులకు పెళ్ళై భార్య గర్భవతి గా ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఆమె ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు ఉపాధిగా జైల్లో అన్ని రకాల వృత్తులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. కాగా చెన్నకేశవులు   తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. 

 

 


ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక  ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.చిన్న కేశవులు, ఇప్పుడు తండ్రి మరణించడంతో ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: