ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ స్థితికి చేరుకుంటుంది. జగన్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ సమాధి అయింది. ఎన్నికలు వస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని చాలామంది నాయకులు విడటం జరిగింది. 2013 ఎన్నికల నాటికి అతి కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలారు. రఘువీరా రెడ్డి, కెవిపి రామచంద్ర రావు, జెడి శీలం, శైలజానాథ్ మరియు సుబ్బిరామి రెడ్డి లాంటి నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండటం జరిగింది. కానీ 2019 ఎన్నికల పరిస్థితి నాటికి మరింత ప్రమాదకరంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. పోటీ చేయటానికి టికెట్ ఇస్తామన్న అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రాలేదు.

 

మొన్నటి వరకు కూడా ఏఐసీసీ గా వ్యవహరించారు రఘువీరారెడ్డి. సడన్ గా ఆయనే తప్పించి ఆ పదవిని శైలజానాథ్ కి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇవ్వటం జరిగింది. అయితే తన అనుమతి లేకుండా తనకు సమాచారం ఇవ్వకుండా తనని పదవి నుండి తప్పించడం తో రఘువీరా రెడ్డి మనస్తాపం చెందినట్టు కాంగ్రెస్ పార్టీలో మొన్నటివరకు వార్తలు వచ్చాయి. దీంతో అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు అంటే ఆయనకు అస్సలు నచ్చదు. అనేకసార్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు ఉద్యమాలు కూడా రఘువీరారెడ్డి చేయడం జరిగింది.

 

దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి రఘువీరారెడ్డి వెళ్లే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది ఆయనకి వైసిపి. ఏపీలో ప్రస్తుతం అధికారంలో వైసిపి ఉంది. పైగా జగన్ అంటే ముందు నుండి రఘువీరా రెడ్డి కి అభిమానం. ముఖ్యంగా తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చినా వైయస్సార్ కొడుకు కావడంతో..జగన్ మీద మరింత గౌరవం రఘువీరా రెడ్డి కి ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత రఘువీరా రెడ్డి జగన్ సమక్షంలో చేరనున్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: