పెరుగుతున్న టెక్నలాజీతో పాటుగా మహానగర్ల్లో నేరాలు ఘోరాలు కూడా అంతకు మించి మరి పెరుగుతున్నాయి. అందుకే పోలీసులు కొత్త కొత్త చట్టాలను అమలులోకి తీసుకొచ్చిన కూడా నేరగాళ్లు వారి పనిని వారు చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ళు కూడా నేరాలను చేయడంలో కొత్త పద్దతులను నేర్చుకుంటున్నారు. 

 

 

 

ఇక్కడ కొందరు కుర్రాళ్ళు నగరాల్లో కలకలం సృష్టించి ఏకంగా ప్రభుత్వానికి 56 లక్షల టోకరా వేశారు.. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ గ్రామీణ నీటిపారుదల కార్పొరేషన్‌లో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేశారు. నవీన్ కుమార్, సాయిరాం.. ఇద్దరూ కలిసి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. కార్పొరేషన్‌లో పనుల కోసం కాంట్రాక్టర్లు చెల్లించిన రూ.55.93 లక్షల సొమ్మును కొట్టేశారు. నేరాలు చేసిన వాళ్ళను పట్టుకొని సమాజాన్ని రక్షించాల్సిన ప్రభుత్వనికి  ముచెమ్మాటాలు పట్టించిన కుర్రాళ్లకు కొందరు శభాష్ అంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటిది మళ్ళీ రిపీట్  కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.  

 

 


ఇందుకోసం ఇంజినీర్ పేరుతో హైదరాబాద్‌లోని ఓ ఆంధ్రా బ్యాంకులో ఖాతా తెరిచారు. అందులో డబ్బు డిపాజిట్ చేసి నెలనెలా రూ.లక్షల్లో లావాదేవీలు జరిపారు.ఈ మోసంపై తగిన ఆధారాలు సేకరించిన అధికారులు గతేడాది అక్టోబరులో వీరిని ఉద్యోగం నుంచి తీసేశారు. కొట్టేసిన సొమ్మును తిరిగి ఇచ్చేలా సంతకాలు చేయించుకున్నారు. రూ.40 లక్షలు తిరిగి ఇచ్చిన నిందితులు.. మిగతా సొమ్మును ఇవ్వబోమని.. దిక్కున్నచోట చెప్పుకోవాలని తేల్చి చెప్పారు.

 


 

ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారం పై నిఘా పెట్టి నిందితుల ఆచూకీని గుర్తించారు. బ్యాంకులో ప్రభుత్వ అధికారి పేరుతో ఖాతా తెరిచేందుకు.. సదరు అధికారే బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టుగా పోలీసుల సమాచారంలో  తేలింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: