మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆ పార్టీ యువనేత జోతిరాధిత్య సింధియా తో కలిసి  బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోందా ? అంటే జరుగుతోన్న పరిణామాలు గమనిస్తే  అవుననే సమాధానం విన్పిస్తోంది . మధ్య ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపధ్యం లో ప్రధాని మోదీతో జోతిరాధ్య సింధియా భేటీ కావాలని నిర్ణయించుకోవడం హాట్ టాఫిక్ గా మారింది .  ఈ రాత్రి తొమ్మిదిన్నర తరువాత , ప్రధాని మోదీ , హోంశాఖ మంత్రి అమిత్ షా లతో సింధియా సమావేశం కానున్నట్లు హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి .

 

ఒకవేళ అదే నిజమైతే హస్తం చేతి నుంచి మధ్య ప్రదేశ్ కూడా చేజారిపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .   మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో సింధియా కు ప్రచార బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం , ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కి లభించినా, చివరి నిమిషం లో  ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదు . దీనితో పార్టీ అధిష్టానం నిర్ణయం పై అసంతృప్తితో రగిలిపోతున్న సింధియా అదను కోసం ఎదురు చూసినట్లు కన్పిస్తోంది . ఇటీవల పదిమంది ఎమ్మెల్యేలు కన్పించకుండా  పోవడం తో మధ్య ప్రదేశ్ రాజకీయం రసకందాయం లో పడింది . అయితే ఈ సంక్షోభం నుంచి  గట్టెక్కామని కాంగ్రెస్ నాయకత్వం  భావిస్తోన్న తరుణం లో సింధియా మద్దతుదారులైన  17 మంది ఎమ్మెల్యేలు కన్పించకుండా పోవడం , వారితోపాటు సింధియా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది .

 

రాజ్యసభ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . ఢిల్లీ లో ఉన్న సింధియా ను కలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ దూతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది . అదే సమయం లో సింధియా , మోదీ, అమిత్ షా లతో భేటీ కానున్నారన్న వార్త కాంగ్రెస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: