తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది ... ఒక సాధారణ వ్యక్తి సినిమాల్లో ఎంతగానో పాపులారిటీ సంపాదించిన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పుడు వరకు మకుటం  లేని మహారాజు అన్నట్లుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలు కొడుతూ ఒక చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. అప్పుడు వరకు అసలు పార్టీ పదవులకు దూరంగా ఉన్నవాళ్లని ఏకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేసేశారు. ఎన్టీఆర్ చేతిలో టిడిపి పార్టీ ఉన్న సమయంలో.. మీడియా పార్టీ గెలుపు ఎంతగా ఉపయోగపడిందో.. ఎన్టీఆర్ చరిష్మా  ఎన్టీఆర్ పాపులారిటీ కూడా ఈనాడు మీడియా ఎదగడానికి అంతే ఉపయోగపడింది. ఇక పార్టీ  చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎక్కువగా మీడియా పై ఆధార పడుతూ వచ్చారు. 

 


 ముఖ్యంగా గతంలో టీడీపీ అనుకూల జర్నలిస్ట్ గా ఉన్న ఏబీఎన్ రాధాకృష్ణ ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి యజమాని  గా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు కీలక నిర్ణయాల్లో ఏబీఎన్ రాధాకృష్ణ కూడా ఒక భాగం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికలకు ముందు... చంద్రబాబు అటు బీజేపీ ఇటు జనసేన తో కలిసి ముందుకు నడవడానికి ఆలోచిస్తున్న సమయంలో చాలామంది చంద్రబాబు నిర్ణయం తప్పు అని చెప్పారు అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మన పార్టీయే గొప్ప మన పార్టీ ఒంటరిగా పోటీ చేసిన గెలుస్తుంది.  బిజెపితో జనసేన పార్టీతో పొత్తు వద్దు అని చెప్పడంతో... చంద్రబాబు కూడా ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఇక చివరికి పర్యవసానంగా... 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది టిడిపి పార్టీ. 

 

 అయితే చంద్రబాబుకు ఈ ఘోర ఓటమి తో గట్టి దెబ్బ తగిలింది అని చెప్పాలి. అయినప్పటికీ ఓర్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలు కార్యకర్తల ధైర్యం చెప్పి  పూర్వవైభవం తీసుకొద్దాం అంటూ దిశానిర్దేశం చేస్తుంటే కొంతమంది టీడీపీ నేతలు మాత్రం కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా నిరాశ పరుస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం ప్రజలను  మోసం చేస్తోంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అది నిరూపించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీరును ఎండగడుతూ... టీడీపీ  గెలవడానికి మంచి అవకాశం వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో కూడా జెసి దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు ఏం పోటీ చేస్తానులే సైలెంట్ గా ఉండడం బెటర్  అని వ్యాఖ్యలు చేస్తుండడం పార్టీ కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యుద్ధం వచ్చినప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేయాలి తప్ప నీతి వాక్యాలు చెప్పకూడదు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: