అవును.. ఇప్పుడు ఏపీలో మందు బాబులు సీఎం జగన్ పేరు చెబితేనే పళ్లు కొరుకుతున్నారు. పీకల్లోతు కోపంలో ఉన్నారు. రోజంతా ఎన్ని చిరాకులు ఉన్నా.. చీకటి పడే వేళ్లకు ఓ చుక్కేసుకుని అందులోనే ప్రశాంతత వెదుక్కునే మందుబాబులు ఏపీలో ఎందరో ఉన్నారు.. ఇప్పుడు వారందరి గుండెళ్లో సీఎం జగన్ బాంబు పేల్చేశాడు. మొన్నటి వరకూ మద్యం ధర పెంచినా మందుబాబులు పెద్దగా ఫీల్ కాలేదు. పోనీలే అని మిగిలిన ఖర్చులు తగ్గించుకున్నారు.

 

 

మద్యం దుకాణాల వేళలు కుదించినా పర్లేదులే.. అని టైమ్ సెన్స్ అలవాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మందే ఆపేస్తే.. మందుబాబులకు కోపం రాదా.. అదేంటి మందు ఆపేస్తే ప్రభుత్వాలు ఎలా బతుకుతాయ్ అంటారా.. అంటే పూర్తిగా కాదు లెండి.. కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమయంలో మద్యానికి ఫుల్ డిమాండ్ కదా.. ఓట్లు కొనాలన్నా.. ప్రచారానికి జనాన్ని తీసుకురావాలన్నా మందు పారించాల్సిందే.

 

 

కానీ ఇప్పుడు జగన్ సర్కారు కొన్ని రోజుల పాటు మందు బంద్ చేయబోతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే జైలు శిక్ష వేసేలా చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే ప్రమాదముందన్నారు.

 

 

అంతే కాదు. ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులు మద్యం సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆయన అలా డిమాండ్ చేసిన గంటల్లోనే ప్రభుత్వం ఆ డిమాండ్ కు ఓకే చెప్పింది. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: