ఉలి దెబ్బలు తగలేకపోతే రాయి శిల్పంగా ఎలా అయితే మారదో.. ప్రజల కోసం కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మంచి పనులు జరగవు అనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ బాగా గుర్తు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ఎలా అయితే అమలు చేస్తున్నాడో అదే విధంగా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ అతిపెద్ద సమస్యగా మారిన మద్యాన్ని ఏపీలో పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మేరకు ఏపీలో ప్రవేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలకు స్వస్తిపలికి ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేయించాడు. అంతే కాదు వాటి అమ్మకాలపై నియంత్రణ కూడా పెట్టి ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాడు. అంతే కాదు దశల వారీగా ఈ మద్యం దుకాణాలను తగ్గించాలని జగన్ చూస్తున్నాడు. 

 

IHG

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఈ మధ్య నిషేధాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయలని చూస్తున్నాడు. ఈ మేరకు ఈ నెల 12 వ తేదీ నుంచి నెలాఖరువరకు మద్యం అమ్మకాలని నిలిపివేస్తున్నట్లుగా మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యకంగా ఓ  నిఘా యాప్ కూడా ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఏపీలో మద్యం అమ్మేది కేవలం ప్రభుత్వమే. అటువంటప్పుడు ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రభుత్వం మద్యం అమ్మడం నిలిపివేస్తే, అసలు పంపిణీ అనే సమస్య ఉండదు అని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

 

IHG 

ఏపీలో మద్యం దుకాణాలను మూసివేస్తే ఆ తరువాత ఎక్కడా మద్యం కనిపించినా అది అక్రమం అవుతుంది కాబట్టి ఎవరూ మద్యం బయట ప్రాంతాల నుంచి తెచ్చేందుకు కూడా బయపడతారని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో మందుబాబుల్లో ఆందోళన కనిపిస్తోంది. అన్ని రోజులపాటు మద్యం దొరక్కపోతే పరిస్థితి ఏంటి అంటూ వారు ప్రత్యామ్న్యాయ మార్గాలు వెతుకుంటున్నారు. ఇప్పటికే భారీగా మద్యం రేట్లు పెంచారని, మందు అమ్మే సమయం తగ్గించారని ఇప్పుడు ఎన్నికల అన్ని రోజులు ఇలా మద్యం దుకాణాలు మూసేస్తే మేమైపోవాలి అంటూ వారు నిట్టూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా జగన్ మద్యం విషయంలో సాహస నిర్ణయమే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ముందు ముందు ఇంకెటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: