ఎందుకు కలిశారో ..?  ఎలా కలిసారో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు స్నేహం చూస్తే మాత్రం ఒకరి బాటలో మరొకరు నడుస్తూ, ఒకరిని ఒకరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి అసెంబ్లీలో సైతం కేసీఆర్ జగన్ పొగుడుతున్నారు. అలాగే జగన్ కూడా కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఏపీలోను అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఫలితాలను తమకు అనుకూలంగా సాధించగలిగింది. 

IHG


ఇప్పుడు అదే బాటలో జగన్ కూడా నడవాలని చూస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోను 90 శాతం ఫలితాలు వైసీపీకి రావాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగానే క్లాస్ పీకుతున్నాడు.తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా అయితే మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నేతలకు ఈ  విధంగా అయితే టార్గెట్లు పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా టార్గెట్లు పెట్టి  ఫలితాలను అనుకూలంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం విపక్షాలు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కూడా ఆ పార్టీలకు ఇష్టం లేదు. 


ఏదో ఒక కారణంతో ఎన్నికలను వాయిదా వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నాయి.ఇదే సమయంలో పంచాయతీరాజ్ చట్టానికి మరింత పదును పెట్టి, కఠినమైన నిబంధనలను తీసుకొచ్చి జగన్ అమలు చేస్తుండడంతో వైసీపీ రాజకీయ ప్రత్యర్ధుల గుండెల్లో దడ దడ మొదలైంది. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఒక్కటమే పరిస్థితి ఉంటుందని వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను ఆలోచన. ఈ విధంగా కెసిఆర్ గతంలో తెలంగాణలో అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా ఏపీలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: