రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్తలలో ఒకరైన తెలుగుదేశం పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అసలు తన నాలిక కు అడ్డు అదుపు లేనట్లు వ్యవహరించే అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. రాబోయే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి దివాకర్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్లు చేశాడు.

 

ముందుగా ఎన్నికల వల్ల ప్రభుత్వం నుండి రాజకీయ నాయకుల కంటే పోలీసు అధికారుల మీద మరియు ఐఏఎస్ అధికారుల మీద ఎక్కువ ఒత్తిడి ఉందని అన్నాడు. సాధారణంగా ప్రతి ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల మీద ఎన్నికల సమయంలో అధిక ఒత్తిడిని తెస్తుంది కానీ ఒత్తిడి సాధారణమైన దాని కంటే చానా భిన్నమైనది అని ఆయన అన్నారు. వారిని కొంచెం కూడా ఊపిరి సలపనివ్వకుండా ప్రభుత్వం వారిని పనిచేయిస్తోందని మరియు ప్రతిపక్షం పార్టీ నాయకులు డబ్బు మరియు మందు పంచుతున్నారని వారిపై కేసులు పెట్టి జైలులో వేయమని ఒత్తిడి చేస్తున్నారని కూడా జేసీ వ్యాఖ్యానించాడు.

 

ఇంకా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు నేను మా జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ ను చూడలేదని అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నాయా లేవా అనే విషయం కూడా అతనికి అర్థం కావట్లేదు అని అన్నాడు. అయితే జేసీ మరింత ముందుకు వెళ్ళి అసలు ఎన్నికలు మరియు సారాయిని విడదీయలేమని.. అదే వాస్తవమని మాట్లాడాడు. కనీసం మహాత్మాగాంధీ వచ్చి చెప్పినా కూడా ఎవరు ఎన్నికలప్పుడు మద్యం సరఫరా చేయడం ఆపరని అన్న అతను గవర్నమెంటు ఖచ్చితంగా తమపై కేసులు వేసి మూడేళ్లు జైలుకు పంపే యోచనలో ఉందని కూడా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: