కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. అయితే అసలు ఈ సమస్య కంటే దీనిపై ప్రచారాలు, వదంతులు ఎక్కువ కావడం కూడా ఎన్నో సమస్యలకు దారి తీస్తోంది. ప్రభుత్వాలు చెప్పే వాటిని పాటించడం కంటే... చిట్కా వైద్యాలు, వాట్సప్ వైద్యాలు, ప్రచారాలు రోగుల కొంప ముంచుతున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాధి చైనా కంటే మరికొన్ని దేశాలను ఎక్కువగా కబళిస్తోంది.

 

 

అలాంటి దేశాల్లో ఇరాన్ ఒకటి. కరోనా వైరస్‌కు నాటుసారా విరుగుడుగా పనిచేస్తుందని

ఇరాన్ లో బాగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అది నమ్మి ఇరాన్‌లో 27 మంది నాటు సారా తాగారు. ప్రాణాలను కోల్పోయారు. ఇదే పని చేసిన మరో 200 మంది ఆస్పత్రి పాలయ్యారు. చావు బతుకుల మధ్య ఉన్నారు.

 

 

ఈ నాటుసారా మృతుల్లో 20 మంది ఖుజెస్థాన్‌ ప్రావిన్సుకు చెందినవారు. మరో ఏడుగురు అల్బోర్జ్‌ ప్రాంతవాసులు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. అసలు ఇలా ఎందుకు జరిగిందంటే.. నాటుసారాలో మెథనాల్‌ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధికంగా తీసుకుంటే వ్యక్తులు కంటి చూపు కోల్పోతారు. కాలేయం దెబ్బతింటుంది. ఒక్కోసారి చనిపోతారు కూడా. ఇప్పుడు అదే జరిగింది. మరో విషయం ఏంటంటే.. ఇరాన్‌లో మద్యపానంపై నిషేధం ఉంది. అయితే కొన్ని ముస్లిమేతర వర్గాలు మాత్రం మద్యం తీసుకోవచ్చు.

 

 

కరోనా ముందుగా చైనాలో ప్రబలిన ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాల్లో ప్రమాదకరంగా ప్రబలుతోంది. ఇరాన్‌ లో ఇప్పటివరకు 7 వేలమందికి పైగా కరోనా బారినపడ్డారు. సోమవారం ఒక్కరోజే కరోనాతో 43 మంది మరణించారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: