కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారం చేపట్టడము జరిగినాక, కాంగ్రెస్ పరిస్దితి దారుణంగా మారింది.. ఒంటిచేతితో ఆ పార్టీని నడిపిద్దామని సోనియా ఎంతగా ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకోవడం లేదు.. ఈ దశలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ మాత్రం తనవంతు కృషి చేస్తూనే ఉన్నారు.. ఇలాంటి సమయంలో అసలే మెజారీటి అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌లో భారీ షాక్ తగిలింది..

 

 

మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.. అసలే స్వల్ప మెజార్టీతో అధికారం చేపట్టిన కమల్‌నాథ్ సర్కార్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్లోని కీలక నేత విలన్‌లా మారారట... ఆయన మరెవరో కాదు.. పార్టీ సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అతిదగ్గరగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా. గతంలోనే ముఖ్యమంత్రి పదవిని ఆక్షాంక్షించిన సింధియా.. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు ఇండికేషన్స్ ఇచ్చారు. అదంతా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావమనే చర్చ  కొనసాగుతోంది. అప్పటినుంచి మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి.

 

 

ఇకపోతే మధ్యప్రదేశ్‌లోని 22 మంది మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్‌నాథ్. ఈ దశలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్నిస్తుందని వాటిని తాను ఒప్పుకోననన్నారు. తన అంతిమ లక్ష్యం పదవులు కాదని, ప్రజాసేవేనని అన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు రాజీనామా చేసిన 12మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తే వారి మంత్రి పదవులు వారికి అప్పగిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు కమల్‌నాథ్..

 

 

ఇకపోతే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో, మొత్తం 230 మంది సభ్యులుండగా  ఇందులో కాంగ్రెస్ కు 114, బీజేపీకి 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ 18మంది కమల్ నాథ్ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సింధియా వర్గం వారే కావడం గమనార్హం. ఇంత జరుగుతున్న ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: