మిరియాల గూడ మారుతీరావు కూతురు అమృత ఆత్మహత్య చేసుకుంటా.. అది కూడా లైవ్ చూపించండి అంటూ ఓ ఛానల్ లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. మారుతీరావు అంత్యక్రియలు ముగిశాక ఓ టీవీ ఛానల్‌ ప్రతినిధులు అమృతతో లైవ్ డిస్కషన్ పెట్టారు. అందుల ఆమె బాబాయ్‌ శ్రవణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంలో వారిద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది.

 

 

ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఆ ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అమృత సంయమనం కోల్పోయింది. కోపంతో బయటకొచ్చి ఇంట్లోని ఫర్నిచర్‌ను చిందరవందరగా పడేసింది. అంతే కాదు.. తాను ఆత్మహత్యకు పాల్పడతానని, దాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేందుకు యత్నించింది. ఆవేశంతో ఊగిపోయిన ఆమె స్పృహ కోల్పోయింది.

 

 

దీంతో షాక్ కు గురయిన ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అసలు మిర్యాల గూడ మారుతీ రావు ఆత్మహత్యతో ఇక ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయం మిర్యాల గూడలో మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి. తండ్రిని చివరి చూపు చూసేందుకు ఆయన కూతురు అమృత అక్కడకు వెళ్లినా.. ఆమె బంధువులు చూడకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృత ప్రెస్‌ మీట్ పెట్టింది. విలేఖరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

 

తన తండ్రికి బినామీ ఆస్తులు ఉండొచ్చని.. వాటి కోసం తన బాబాయి శ్రవణ్ తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని చెప్పింది. అయితే అమృత ప్రెస్ మీట్ పెట్టి బాబాయిపై ఆరోపణలు చేసిన విషయం తెలుసుకున్న తర్వాత ఆమె బాబాయ్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అమృతపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమృత చేసిన చెత్త పని వల్లే ఇన్ని దారుణాలు జరిగాయని అమృత బాబాయి శ్రావణ్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: