ప్రపంచం మొత్తం డబ్బు మీద నడుస్తున్న సంగతి తెలిసిందే...అందుకోసం ప్రజలు కనిపించని దారులులను కూడా ఎంచుకొని మరి డబ్బులను సంపాదిస్తున్నారు.. మరి కొందరు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు.. ఆ క్రమంలో నేరాలనుచేయడానికి కూడా వెనకాడటం లేదు.. ఇంట్లో వాళ్ళను సైతం మరిచి పోయి డబ్బు వ్యామోహంలో నీచనికి దిగజారుతున్న రు...

 

 

 

విషయానికొస్తే...అమాయకుల్ని చేసి, దోపిడీలు చేసే ముఠాల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. చివరికి గే చాట్‌లు చేసి, దోపిడీలు చేస్తున్న ముఠాను నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. స్వలింగ సంపర్కుల కోసం ఉండే ప్రత్యేక డేటింగ్ యాప్‌ల ద్వారా యువకులకు వలవేసి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. నిఘా పెట్టి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా.. వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో యువకులను మోసం చేసినట్లు వెల్లడైంది.

 

 

 

ఇలా అబ్బాయిలను మోసం చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ మేరకు కేసును కూడా నమోదు చేశారు... అయితే ఈ ఐదుగురు గతంలో చాలా అన్యాయాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.. పర్సనల్ గే చాటింగ్ యాప్‌లో ఈ ఐదుగురిలో ఓ వ్యక్తితో గే చాట్ చేసి మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి దందా వ్యవహారం బయటికి వచ్చింది...

 

 

 

 

ఏకాంతంగా కలుసుకుందామని చెప్పిన నిందితుడు ఓ ప్రదేశంలో తనను కలిశాడని తర్వాత ఈ ఐదుగురు వచ్చి బెదిరించి తనను ఏటీఎం వద్దకు తీసుకెళ్లారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాక, తనతో బలవంతంగా డబ్బు విత్ డ్రా చేయించారని వెల్లడించాడు. తనలా మరెవరూ మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తెచ్చినట్లుగా బాధితుడు వెల్లడించాడు... ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వారి అరెస్టయిన వారి నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రూ.1.14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: