జగన్, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులన్న సంగతి తెలిసిందే. అయినా సరే చంద్రబాబు కోరిన ఓ కోరికను జగన్ ఆఘమేఘాల మీద తీర్చేశాడు.. అది రిస్క్ అని తెలిసినా.. సరే.. దాని వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసినా సరే.. జగన్ మాత్రం చంద్రబాబు కోరిక తీర్చేందుకే ప్రయారిటీ ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబు కోరిందేంటి.. జగన్ తీర్చిందేంటి..?

 

 

స్థానిక ఎన్నికల సమరం ఏపీరో రాజుకుంటున్న వేళ.. వైకాపా మద్యం, డబ్బు పంపిణీ చేసి గెలవానుకుంటోందని చంద్రబాబు సోమవారం ఆరోపించారు. దమ్ముంటే.. 20 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. బహుశా తాను అడిగితే జగన్ చేయడన్న నమ్మకమో ఏమో బాగా గట్టిగా నిలదీశారు చంద్రబాబు.

 

 

అయితే అనూహ్యంగా చంద్రబాబు డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జగన్ సర్కారు కొన్ని రోజుల పాటు మందు బంద్ చేయబోతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు మంత్రి చెప్పారు.

 

 

ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పుడు ఏపీలో మందుబాబులు.. చంద్రబాబు పేరు చెబితే మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులు మద్యం సరఫరాను నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ పాపం చంద్రబాబుదే అని చెప్పుకునే అవకాశం తలెత్తింది. దీంతో ఇప్పుడు టీడీపీ నాయకులు తలపట్టుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: