మూడు దశాబ్దాల పాటు జిల్లాను శాసించిన జేసి సోదరుల్లో అరెస్టు భయం పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా జేసి సోదరులకు అనంతపురం జిల్లాలో తిరుగన్నదే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు దశాబ్దాల రాజకీయంలో 25 ఏళ్ళు కాంగ్రెస్ లోను చివరి ఐదేళ్ళు టిడిపిలో ఓ వెలుగు వెలిగారు.

 

అధికార పరంగా ఎప్పుడైతే తిరుగులేకుండా పోయిందో సోదరులు అడ్డదిడ్డమైన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు తెరలేపారు. విచిత్రమేమిటంటే అప్పట్లో చేసిన అడ్డదిడ్డమైన అవినీతి, అరాచకాలే ఒక్కసారిగా బయటపడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన తర్వాత సోదరుల జాతకాలు కూడా తిరగబడ్డాయనే చెప్పాలి. గడచిన తొమ్మిది నెలలుగానే గ్రహస్ధితి పూర్తిగా తిరగబడినట్లే ఉంది. ఇందులో భాగంగానే వీళ్ళపై రకరకాల కేసులు నమోదవుతున్నాయి.

 

తాజాగా తుక్కులారీల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగు  చూసింది.  కర్నాటక, తమిళనాడు, చత్తీస్ ఘడ్ లో తుక్కు లారీలను టోకున కొనేసి వాటిని రీమోడల్ చేయించి బస్సులుగా మార్చేసిన విషయం బయటపడింది. ఇప్పటికే బస్సుల అక్రమ ట్రిప్పులు, అసలు పర్మిట్లే లేకుండా తిప్పటాలు వంటి కేసులు నమోదైన సోదరులపై ఈ తుక్కు లారీల అక్రమ రిజిస్ట్రేషన్ లో అడ్డంగా బుక్కైపోయినట్లు అర్ధమైపోతోంది.

 

ఇందుకే తాము లారీలను ఎవరి దగ్గరైతే కొన్నారో వాళ్ళతో జేసి సోదరులు మాట్లాడుతున్నారట. దాదాపు 60 లారీలను కొన్న సోదరులు వాటిని రెడీ చేసి మళ్ళీ ఇతరులకు తక్కువ ధరలకే అమ్మేశారట. తక్కువ ధరలకే బస్సులు వస్తున్నాయన్న సంబరంలో కొందరు వాటిని కొనేశారు. అయితే సోదరులు చేసిన మోసం బయటపడేటప్పటికి వీళ్ళదగ్గర బస్సులను కొన్నవారిపైన రవాణా శాఖ కేసులు పెట్టింది. దాంతో బస్సులు కొన్నవాళ్ళంతా తాము జేసి సోదరుల దగ్గర బస్సులు కొన్నామని తమను మోసం చేసి తమకు బస్సులను అంటకట్టారంటూ వాళ్ళంతా సోదరులపై ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ పద్దతిలో సోదరులు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కునేశారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: